ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గర్భిణికి ఆపరేషన్ చేసి, పిండాన్ని పెంపుడు కుక్కకు తినిపించిన వైద్యులు.. 11 రోజుల తర్వాత చూస్తే..

ABN, First Publish Date - 2023-01-21T15:54:48+05:30

వైద్యం పేరుతో లక్షలకు లక్షలు డబ్బుులు వెనకేసుకునేవారు కొందరైతే.. మరికొందరు, వచ్చీరాని వైద్యం చేసి రోగుల ప్రాణాలతో ఆడుకుంటూ ఉంటారు. తెల్లచొక్కా, మెడలో స్టెతస్కోపు వేసుకున్న ప్రతి ఒక్కరూ...

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైద్యం పేరుతో లక్షలకు లక్షలు డబ్బుులు వెనకేసుకునేవారు కొందరైతే.. మరికొందరు, వచ్చీరాని వైద్యం చేసి రోగుల ప్రాణాలతో ఆడుకుంటూ ఉంటారు. తెల్లచొక్కా, మెడలో స్టెతస్కోపు వేసుకున్న ప్రతి ఒక్కరూ వైద్యులని నమ్మి.. ఎంతో మంది తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడోచోట చోటు చేసుకుంటూనే ఉంటాయి. బీహార్‌లో తాజాగా విషాద ఘటన చోటు చేసుకుంది. గర్భిణికి ఆపరేషన్ చేసిన వైద్యులు.. చివరకు పిండాన్ని పెంపుడు కుక్కకు తినిపించారు. చివరకు 11రోజుల తర్వాత విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

భర్త ఆదాయం సరిపోలేదని విసిగిపోయిన భార్య.. తల్లి సాయంతో ఆమె చేసిన పని తెలుసుకుని అవాక్కైన భర్త.. చివరకు..

బీహార్ (Bihar) హాజీపూర్‌లోని బలిగావ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చంపాపూర్ అగ్రైల్ గ్రామానికి చెందిన ఓ మూడు నెలల గర్భిణికి (pregnant) ఇటీవల సడన్‌గా కడుపు నొప్పి వచ్చింది. దీంతో స్థానికంగా ఉన్న ఓ నర్సింగ్ హోమ్‌కు (Nursing home) తీసుకెళ్లారు. చికిత్స చేసిన వైద్యులు ఆమెకు అబార్షన్ (Abortion) చేశారు. అయితే అబార్షన్ చేసిన కొద్ది సేపటికే యువతి ఆరోగ్యం క్షీణించింది. దీంతో వైద్యులు ఆలోచనలో పడ్డారు. ఎక్కడ కేసు తమ మీదకు వస్తుందోననే భయంతో యువతి పిండాన్ని తమ పెంపుడు కుక్కకు తినిపించారు. తర్వాత యువతికి మెరుగైన చికిత్స చేయించేందుకు కుటుంబ సభ్యులు.. పాట్నాలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ 11రోజుల తర్వాత మృతి చెందింది.

ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న యువకుడు.. ప్రియురాలికి జాబ్ రావడంతో బెంగళూరుకు ట్రైన్ ఎక్కించి.. తర్వాత చూస్తే..

ఈ విషయం తెలిసిన వెంటనే యువతికి వైద్యం చేసిన దంపతులు.. నర్సింగ్ హోమ్‌కు తాళం వేసి పరారయ్యారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు. విచారణలో యువతికి అబార్షన్ చేసింది.. నకిలీ వైద్యులని (Fake doctors) తేలింది. భార్యాభర్తలు కలిసి ఎంబీబీఎస్ పేరుతో నకిలీ సర్టిఫకెట్లు (Fake certificates) సృష్టించారని తెలిసింది. అయితే పిండాన్ని కుక్కకు తినిపించారనే ఆరోపణల్లో ఇంకా సరైన ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న భార్యాభర్తల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రియుడితో కలిసి గదిలో ఉండగా ఇంట్లోకి వచ్చిన కొడుకు.. మీ నాన్నకు చెప్పొందంటూ.. చివరకు తల్లి చేసిన పని..

Updated Date - 2023-01-21T15:54:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising