Viral News: అసలు కారణం అదేనంటూ నివ్వెరపోయే నిజాన్ని చెప్పిన డాక్టర్లు.. 10 ఏళ్ల కూతురికి కడుపునొప్పి వస్తోందని ఆస్పత్రికి తీసుకెళ్తే..
ABN, First Publish Date - 2023-04-01T19:52:10+05:30
కొందరు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల చుట్టూ తిరిగి అసలిపోతుంటారు. ఎంత డబ్బు ఖర్చు చేసినా ఫలితం మాత్రం ఉండదు. చివరకు సమస్యకు గల అసలు కారణం తెలుసుకుని అంతా షాక్ అవుతుంటారు. ఇలాంటి అరుదైన కేసులకు సంబంధించిన వార్తలు..
కొందరు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల చుట్టూ తిరిగి అసలిపోతుంటారు. ఎంత డబ్బు ఖర్చు చేసినా ఫలితం మాత్రం ఉండదు. చివరకు సమస్యకు గల అసలు కారణం తెలుసుకుని అంతా షాక్ అవుతుంటారు. ఇలాంటి అరుదైన కేసులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం ఓ పదేళ్ల బాలికకు సంబంధించిన వార్త వైరల్‌గా మారింది. కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన బాలికను వైద్యులు పరీక్షించారు. చివరకు సమస్యకు గల అసలు కారణం చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ముంబైలోని (Mumbai) దాదర్‌కు చెందిన పదేళ్ల బాలికకు (girl) అరుదైన సమస్య వచ్చి పడింది. రుతుక్రమం వచ్చినప్పటి నుంచి సదరు బాలిక అనారోగ్య సమస్యను ఎదుర్కొంటోంది. దీనికితోడు ఏడాదిగా విపరీతమైన కడుపునొప్పితో (stomach ache) బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం మాత్రం కలగలేదు. ఇటీవల ఆమె రోజు రోజుకూ బరువు తగ్గుతూ వస్తోంది. దీంతో ఇటీవల కూతురుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మొదట బాలిక కడుపులో ఏదో గడ్డ ఉన్నట్లు గుర్తించారు. చివరగా స్కానింగ్ (scanning) తీయగా.. కడుపులో ఉన్నది గడ్డ కాదని, ఏదో వింత వస్తువులా కనిపించింది.
సుమారు 2గంటల పాటు ఆపరేషన్ (Operation) చేసి చివరకు కడుపులోని 100 గ్రాముల వెంట్రుకల కట్టను తొలగించారు. కడుపులో వెంట్రుకలు (hair) ఉండడాన్ని చూసి బాలిక తల్లిదండ్రులు షాక్ అయ్యారు. బాలిక ట్రైకోటిల్లోమానియా (Trichotillomania) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి ఉన్న వారు వెంట్రుకలు తింటూ ఉంటారని వివరించారు. ఎట్టకేలకు విజయవంతంగా ఆపరేషన్ చేసి, వార రోజుల అనంతరం డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రాణాలను కాపాడిన వైద్యులకు బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Updated Date - 2023-04-01T19:52:10+05:30 IST