ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: కుక్కను తిందామని నక్కి నక్కి వెళ్లిన చిరుత.. తీరా దాడిచేయబోయే సమయంలో చివరకు ఏం జరిగిందో చూడండి..

ABN, First Publish Date - 2023-11-01T21:51:45+05:30

పులులు, సింహాలను చూస్తే మిగతా జంతువులు ఆమడ దూరం పారిపోతాయి. ఒక్కసారి వాటి కంట పడ్డాయంటే ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అలాంటి పులులు, సింహాలకూ కొన్నిసార్లు ఛేదు అనుభవం ఎదురవుతుంటుంది. కొన్నిసార్లు...

పులులు, సింహాలను చూస్తే మిగతా జంతువులు ఆమడ దూరం పారిపోతాయి. ఒక్కసారి వాటి కంట పడ్డాయంటే ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అలాంటి పులులు, సింహాలకూ కొన్నిసార్లు ఛేదు అనుభవం ఎదురవుతుంటుంది. కొన్నిసార్లు నోటిదాకా వచ్చిన ఆహారం కాస్త.. ఉన్నట్టుండి చేజారిపోతుంటుంది. మరికొన్ని సార్లు చిన్న చిన్న జంతువుల చేతిలో కూడా ఓడిపోయి తోకముడవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కుక్కపై దాడి చేసేందుకు ఓ మంచు చిరుత నక్కి నక్కి వెళ్లింది. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కొండల్లో ఓ మంచు చిరుత (Snow leopard) ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో దానికి దూరంగా చనిపోయిన మేకను తింటున్న కుక్క కనిపిస్తుంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు అనుకుంటూ.. ఎలాగైనా కుక్కపై దాడి చేయాలని ప్లాన్ వేస్తుంది. మేక కళేబరాన్ని లాక్కెళ్తున్న కుక్క వద్దకు మెల్లగా నక్కి నక్కి వెళ్తుంది. దగ్గరికి వెళ్లాక ఒక్కసారిగా (leopard tried to attack dog) కుక్కపై దాడికి దిగుతుంది. చిరుతను చూడగానే కుక్క అలెర్ట్ అవుతుంది. చిరుతపై గట్టిగా మొరుగుతూ అలాగే నిలబడుతుంది. కుక్క ఆవేశాన్ని చూసిన చిరుపులి కాస్త వెనకడుగు వేస్తుంది.

Bank Holidays in November: దీపావళి పండుగ రోజే కాదండోయ్.. నవంబర్ నెలలో ఏకంగా 15 రోజులు బ్యాంకులకు సెలవులే..!

పులి పరధ్యానంలో ఉన్న సమయంలో ‘‘తప్పించుకోవడానికి ఇదే మంచి తరుణం’’.. అని అనుకుంటూ కుక్క ఒక్కసారిగా అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తుంది. కుక్క పారిపోవడాన్ని గమనించిన పులి.. దాన్ని వెంటబడే ప్రయత్నం చేస్తుంది. అయితే అప్పటికే కుక్క అక్కడి నుంచి వెళ్లిపోవడంతో తన ఆలోచనను విరమించుకుని మేక కళేబరంతో సరిపెట్టుకుంటుంది. పులి తనపై ఎక్కడ దాడి చేస్తుందో అనే భయంతో వెనక్కు చూడకుండా వేగంగా పరుగెత్తిన కుక్క.. మధ్యలో రాళ్లు తగులుకొని పల్టీలు కొడుతుంది. అయినా చివరకు పైకి లేచి అక్కడి నుంచి దూరంగా పారిపోతుంది. ఈ ఘటన మొత్తం దూరం నుంచి పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Marriage Tradition: బాబోయ్.. చైనాలోని పెళ్లిళ్లలో వింత ఆచారం.. వధువు కోసం వస్తున్న వరుడిని నడిరోడ్డుపై ఆపి మరీ..!

Updated Date - 2023-11-01T21:51:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising