ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: కిడ్నాపర్లను హడలెత్తించిన వీధి కుక్క.. ఆ బాలిక ఎలా బయటపడిందో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-08-27T15:31:03+05:30

ఎన్నో వందల ఏళ్లుగా మనుషులకు కుక్కలు విశ్వాసంగా ఉంటున్నాయి. ఎప్పుడైనా కొద్దిగా ఆహారం ఇస్తే చాలు ఆ వ్యక్తిని కుక్క ఎప్పటికీ మర్చిపోదు. కుక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ఎప్పటికప్పుడు కొత్త సమాచారం వస్తూనే ఉంది.

ఎన్నో వందల ఏళ్లుగా మనుషులకు కుక్కలు (Dogs) విశ్వాసంగా ఉంటున్నాయి. ఎప్పుడైనా కొద్దిగా ఆహారం ఇస్తే చాలు ఆ వ్యక్తిని కుక్క ఎప్పటికీ మర్చిపోదు. కుక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ఎప్పటికప్పుడు కొత్త సమాచారం వస్తూనే ఉంది. కుక్కలను పెంచడం వల్ల కేవలం భద్రత మాత్రమే కాదు.. కుక్కలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, శారీరక శ్రమను పెంచడానికి కూడా సహాయపడతాయి. అంతేకాదు అప్పుడప్పుడు భారీ ప్రమాదాల నుంచి కూడా కాపాడతాయి (Dog saves school girl).

తాజాగా ఓ బాలికను ఓ వీధి కుక్క పెద్ద ప్రమాదం నుంచి కాపాడింది. ఆ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ బాలిక ఒంటరిగా స్కూల్ నుంచి నడిచి వస్తోంది. అదే సమయంలో ఓ కారులో వచ్చిన దుండగులు బాలికను కిడ్నాప్ (Kidnap) చేయడానికి ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న వీధి కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి వారిని హడలెత్తించింది. దీంతో వారు భయపడి వెళ్లిపోయారు. వాళ్లు కిడ్నాప్ చేయడానికి వచ్చారని ఆ కుక్కు తెలియకపోయినా, కొత్తగా వచ్చిన కారును వెంబడించి అది అరిచింది (Dog Videos).

Shocking: స్కూలుపై నుంచి దూకేసిన 6వ తరగతి బాలిక.. ఆమె స్కూల్ బ్యాగులో వెతికితే..!

@cctvidiots అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియో బాగా వైరల్ (Viral Video) అయింది. దాదాపు 2 కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. 3.8 లక్షల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``తన సామ్రాజ్యంలో కొత్తగా వచ్చిన వారిని కుక్క బెదిరించింది``, ``వీధి కుక్కల వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి``, ``ఆ కుక్కకు మంచి బోన్ కొని పెట్టాలి``, ``సూపర్ డాగ్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-08-27T15:31:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising