ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: బాలికను కిడ్నాప్ చేయాలని చూసిన దుండగులు.. గమనించిన కుక్క చివరకు ఏం చేసిందో చూడండి..

ABN, First Publish Date - 2023-07-01T21:50:37+05:30

మనిషి మానవత్వం మరచి హత్యలు, అచ్యాచారాలకు పాల్పడుతున్న సేటి సమాజంలో.. మీకంటే మేము చాలా మేలు అని జంతువులు నిరూపిస్తుంటాయి. ముఖ్యంగా విశ్వాసం ప్రదర్శించడంలో ముందుండే కుక్కలను చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి. తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనిషి మానవత్వం మరచి హత్యలు, అచ్యాచారాలకు పాల్పడుతున్న సేటి సమాజంలో.. మీకంటే మేము చాలా మేలు అని జంతువులు నిరూపిస్తుంటాయి. ముఖ్యంగా విశ్వాసం ప్రదర్శించడంలో ముందుండే కుక్కలను చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి. తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి యజమానులను కాపాడిన కుక్కలను చాలా చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం కిడ్నాప్ చేయాలని చూసిన దుండగుల నుంచి బాలికను కాపాడిన కుక్క వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇలాంటి కుక్క ఒక్కటి ఉంటే చాలు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ బాలిక (girl) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటుంది. అయితే అంతకు ముందు నుంచే కొందరు ఓ కారులో ఆమెను ఫాలో అవుతుంటారు. అదును చూసి కిడ్నాప్ చేయాలని వెనుకే వస్తుంటారు. అయితే ఇదేమీ గమనించని బాలిక తన పాటికి తాను నడుచుకుంటూ వెళ్తుంటుంది. నిర్మానుష్య ప్రదేశానికి చేరుకోగానే వెనుక వస్తున్న కారు వేగంగా ముందుకు వస్తుంది. బాలిక పక్కగా ఆపి కిడ్నాప్ (kidnap) చేయాలని చూస్తారు. దీంతో అలెర్ట్ అయిన ఆమె.. భయంతో వెనక్కు వెళ్తుంది. వారు కూడా వెనక్కు వెళ్లి బాలిక దగ్గర కారు ఆపి, డోరు తీసి కిందకు దిగేందుకు ప్రయత్నిస్తారు.

Delivery Boy: ఈ డెలివరీ బాయ్‌కు ఇదేం పాడుబుద్ది.. ఓ యువతి పిజ్జా ఆర్డర్ చేస్తే..

అయితే ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న కుక్క.. అత్యంత వేగంగా అక్కడికి వస్తుంది. కారు డోరు వద్ద అడ్డుగా నిలబడి ‘‘నేను ఉండగా కిడ్నాప్ చేయడం మీ వల్ల కాదు’’.. అన్నట్లుగా గట్టిగా మొరుగుతుంది. కుక్క (dog) ఆవేశం చూసి దుండగులు వెనక్కు తగ్గి, అక్కడి నుంచి ఉడాయిస్తారు. అప్పటికీ వదలని కుక్క చాలా దూరం కారును వెంబడిస్తుంది. ఊహించని ఈ ఘటనతో బాలిక భయంతో వణికిపోతుంది. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఈ కుక్కకు నిజంగా సెల్యూట్ చేయాల్సిందే’’.. అంటూ కొందరు, ‘‘మనుషుల కంటే ఈ కుక్క ఎంతో మేలు’’.. అని మరికొందరు, ‘‘ఈ కుక్కను చూసి ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఇలాంటి భర్త ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే.. వదిలేయడం బెటర్.. అంటూ ఆ భార్యకు అంతా సలహాలు ఎందుకిస్తున్నారంటే..!

Updated Date - 2023-07-01T21:53:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising