ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dog Video: 4 నెలలుగా ఆస్పత్రి మార్చురీ వద్దే పడిగాపులు కాస్తున్న శునకం.. చనిపోయిన యజమాని తిరిగొస్తాడన్న ఆశతో..!

ABN, First Publish Date - 2023-11-07T16:55:59+05:30

పాపం ఆ కుక్క.. తన యజమాని కోసం కళ్లు కాయలు చేసేలా చూస్తోంది. ఒకటి రెండు కాదు 4 నెలల నుండి..

జంతువులన్నింటిలో మనిషికి చాలా తొందరగా దగ్గరయ్యేది శునకమే. కుక్కలు పొంచి ఉన్న ప్రమాదాలను ఇట్టే పసిగడతాయి. కుక్క ఇంట్లో ఉంటే చాలు దొంగల బెడద ఉండదని చాలామంది కుక్కలు పెంచుకునేవారు. అది కాస్తా ఫ్యాషన్ గా కుక్కలను పెంచుకునే వరకు తీసుకొచ్చింది. శునకాలకు, వాటి యజమానులకు మధ్య ఉండే అనుబంధం మాటల్లో చెప్పలేనిది. ఇంట్లో చిన్న పిల్లలతో సమానంగా కుక్కలు గారం పోతాయి. యజమానులు కూడా కుక్కలను పసిబిడ్డల్లా చూసుకుంటారు. పాపం ఆ కుక్క.. తన యజమాని కోసం కళ్లు కాయలు చేసేలా చూస్తోంది. ఒకటి రెండు కాదు 4 నెలల నుండి హాస్పిటల్ ముందే మకాం వేసి అతని కోసం నిరీక్షిస్తోంది. తన యజమాని హాస్పిటల్ లోనే చికిత్స పొందుతున్నాడని, తనకోసం మళ్లీ వస్తాడని, తనను ప్రేమగా చూసుకుంటాడనే పిచ్చి నమ్మకంతో మార్చురీ గది దగ్గరే మకాం వేసింది. హృదయాలను బరువెక్కిస్తున్న ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

కేరళలో(Kerala) ఓ కుక్కకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళ రాష్ట్రం కన్నూర్(Kannur) ప్రభుత్వ వైద్యశాలలో నాలుగు నెలల క్రితం ఓ వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. అయితే అతను చితిత్స పొందుతూ మృతి చెందాడు. అతన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ గదిలోకి తీసుకెళ్ళగా అది అతను పెంచుకున్న కుక్క చూసింది. అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకెళ్లిపోయినా కుక్క మాత్రం అక్కడి నుండి కదల్లేదు. తన యజమాని వస్తాడని, తనతో మాట్లాడుతాడని, తనను మళ్లీ ప్రేమగా చూసుకుంటాడని అది అక్కడే పడిగాపులు కాస్తోంది. ఏకంగా నాలుగు నెలల నుండి అక్కడే ఉంటోంది(dog waiting for his owner for 4 months). హాస్పిటల్ కు వచ్చిన ఎవరైనా దానిమీద జాలి పడి ఏదైనా పెడితే తింటుంది. ఆ తరువాత మళ్లీ మమూలుగానే మార్చురీ గదివైపు దిగులుగా చూస్తూ గడుపుతుంది. హాస్పిటలో లో పనిచేసే ఉద్యోగి కూడా ఆ కుక్క ఎంత నమ్మకమైందో చెబుతుండటం పలువురి మనసులను బరువెక్కిస్తోంది.

ఇది కూడా చదవండి: Roti Making Mistakes: చపాతీ పిండిని కలిపేటప్పుడు.. చాలా మంది తెలియక చేస్తున్న బిగ్ మిస్టేక్స్ ఇవే..!



ఈ కుక్కకు సంబంధించిన వీడియోను ప్రముఖ న్యూస్ ఛానెల్ ANI తన ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్లో షేర్ చేసింది. కుక్క పరిస్థితిని క్యాప్షన్ లో వివరించింది. ఈ వీడియో చూసిన నెటిజన్ల మనసు బరువెక్కుతోంది. పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 'కుక్కల విశ్వాసం గురించి ఈ ప్రపంచంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇది కూడా ఒకటి' అని ఒకరు కామెంట్ చేశారు. 'పాపం దాని యజమాని ఇక లేడని దానికెలా తెలుస్తుందో ఏంటో' అని ఇంకొకరు అన్నారు. పలువురు కుక్క పరిస్థితి చూసి బాధపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Woman: అమ్మ బాబోయ్.. ఈ మహిళ యవ్వారం మామూలుగా లేదుగా.. పోలీసు అధికారిపైనే కేసు పెట్టింది.. అసలు కథేంటంటే..!


Updated Date - 2023-11-07T16:56:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising