ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Miracle: ట్రక్కు దెబ్బకు నుజ్జునుజ్జయిన కారు.. పాపం.. ఎంత మంది చనిపోయారో అని కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తోంటే..!

ABN, First Publish Date - 2023-05-19T19:59:27+05:30

కొన్నిసార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే మరికొన్ని సార్లు ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఎవరికీ ఏమీ కాదు. చాలా మంది ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ప్రయాణిస్తూ.. తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటివారిని కూడా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్నిసార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే మరికొన్ని సార్లు ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఎవరికీ ఏమీ కాదు. చాలా మంది ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ప్రయాణిస్తూ.. తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటివారిని కూడా ప్రమాదంలో పడేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రక్కు ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. లోపల ఉన్న వారికి ఏమయిందో అని అంతా కంగారుపడుతుంటే.. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

సోషల్ మీడియాలో రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో (Viral video) ఒకటి తెగ వైరల్ అవుతోంది. వేగంగా వస్తున్న ఓ ట్రక్కు ముందు వెళ్తున్న కారును (truck hit a car) ఢీకొంది. దీంతో కారు వేగంగా వెళ్లి ముందున్న మరో లారీకి కిందకు చొచ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాద తీవ్రత చూసి.. కారులో ఉన్న వారంతా చనిపోయి ఉంటారని అంతా అనుకున్నారు. వెంటనే వెళ్లి కారు డోరును బయటకు లాగే ప్రయత్నం చేస్తారు. తర్వాత లోపల ఉన్న మనిషిని బయటకు తీయాలని ప్రయత్నించారు. అయితే అంతలో ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది.

Viral Video: జింకలను వేటాడుతూ నీళ్లలోకి దూకిన పులి.. చివరకు ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..

సీటులో కూర్చున్న వ్యక్తి.. క్షేమంగా కిందకు దిగి నడుచుకుంటూ బయటికి వచ్చాడు. అతడికి చిన్న గాయం కూడా కాకపోవడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎయిర్ బ్యాగ్ (Air bag) ఉండడంతో పాటూ సీటు బెల్టు (Seat belt) పెట్టుకోవడంతో అతడికి ఎలాంటి గాయాలూ కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘యమధర్మ రాజు సెలవులో ఉన్నాడేమో’’.. అని కొందరు, ‘‘ఇతడు ఎంతో అదృష్టవంతుడు’’.. అని మరికొందరు, ‘‘ఎయిర్ బ్యాగు, సీటు బెల్టు వల్ల ఎంత ప్రయోజనం’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: అక్కడ స్పేస్ లేదు.. క్రియేట్ చేసుకున్నారు.. ఈ బైక్ వీడియో చూస్తే త్రివిక్రమ్ డైలాగ్ గుర్తుకురావడం ఖాయం..!

Updated Date - 2023-05-19T20:05:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising