ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Magic Mirror: అద్దంలో నగ్నంగా కనిపిస్తారంటూ కేటుగాళ్ల బురిడీ.. రూ.9లక్షలు పొగొట్టుకున్న వృద్ధుడు..!

ABN, First Publish Date - 2023-08-18T14:09:25+05:30

ఈ అద్దం ప్రజలను నగ్నంగా చూపిస్తుందని నమ్మించి, వృద్దుడి వద్ద నుంచి రూ.9లక్షలు కొట్టేసిన కేటుగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఈ అద్దం ప్రజలను నగ్నంగా చూపిస్తుందని నమ్మించి, వృద్దుడి వద్ద నుంచి రూ.9లక్షలు కొట్టేసిన కేటుగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'ఇది మ్యాజిక్ మిర్రర్. దీని ద్వారా ప్రజలను నగ్నంగా చూడొచ్చు. మేం సింగపూర్ నుంచి వచ్చాం. రూ.2కోట్లకు అమ్ముతాం' అని నమ్మించారు. వారి మాటలు నమ్మిన ఆ వృద్దుడు అడ్వాన్స్‌గా రూ.9లక్షలు చెల్లించాడు. తీరా మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్‌ (Kanpur) కు చెందిన 72 ఏళ్ల అవినాష్ కుమార్ శుక్లాకు తెలిసిన వారి ద్వారా ముగ్గురు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తులు పరిచయం అయ్యారు. పెద్దాయన ఒంటరిగా ఉండడం, ఆయనకు ఎవరు లేరని తెలుసుకున్న ఆ ముగ్గురు ఒక ప్లాన్ వేశారు. ముందు అవినాష్‌తో మంచిగా మాటలు కలిపిన కేటుగాళ్లు తమ వద్ద ఓ అద్దం ఉందని, అందులో మనుషులను నగ్నం (Naked) గా చూడొచ్చని నమ్మబలికారు. తాము సింగపూర్ కంపెనీతో కలిసి ఈ పని చేస్తున్నట్లు నమ్మించారు. అంతేగాక ఆ అద్దాన్ని నాసా శాస్త్రవేత్తలు (NASA Scientists) ఉపయోగించినట్లు కూడా చెప్పారు. సాధారణంగా ఆ మ్యాజిక్ మిర్రర్ (Mirror Magic) ఖరీదు చాలా ఎక్కువ అని, కానీ ప్రస్తుతం ఆఫర్ కింద రూ.2కోట్లకు ఇస్తామని అవినాష్‌ను నమ్మించారు.

Funniest Video Ever: టామ్ అండ్ జెర్రీలానే.. నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో కూడిన ఈ వీడియో చూసి పగలబడి నవ్వకుండా ఉండలేరు..!


దాంతో ఆయన వారికి అడ్వాన్స్‌గా రూ.9లక్షలు ఇచ్చాడు. మిగతాది అద్దం చేతికి వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పాడు. దాంతో వారు అద్దం తీసుకోవడానికి భువనేశ్వర్ రావాల్సిందిగా చెప్పారు. వారు చెప్పిన చోటికి వెళ్లగా అక్కడ ఎవరూ లేరు. దాంతో తాను మోసపోయానని గ్రహించిన పెద్దాయన భువనేశ్వర్‌లోని నయాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురు కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని పార్థ సింఘారే, మోలయ సర్కార్, సుదిప్తా సిన్హా రాయ్‌గా గుర్తించారు. వారి నుంచి రూ.28వేల నగదు, ఐదు సెల్‌ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

Viral Video: ఉబెర్ డ్రైవర్ ఐడియాకు ఫిదా అవుతున్న ప్యాసింజర్లు.. సింప్లీ సూపర్బ్ అంతే..!

Updated Date - 2023-08-18T14:09:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising