ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: కాపాడినందుకు థ్యాంక్స్.. బావిలో పడిన ఏనుగును కాపాడిన సిబ్బంది.. వీడియో వైరల్!

ABN, First Publish Date - 2023-07-19T15:57:00+05:30

అటవీ పరివాహక ప్రాంతాల్లో బావులు, కందకాలు, పెద్ద పెద్ద గోతులు వన్య ప్రాణులకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఆహారం లేదా నీటి కోసం అప్పుడప్పుడు అడవి బయటకు వచ్చే జంతువులు వాటి వల్ల ప్రమాదాలకు గురవుతున్నాయి. చాలా జంతువులు బావులు, గోతుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి.

అటవీ పరివాహక ప్రాంతాల్లో (Forest) బావులు, కందకాలు, పెద్ద పెద్ద గోతులు వన్య ప్రాణులకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఆహారం లేదా నీటి కోసం అప్పుడప్పుడు అడవి బయటకు వచ్చే జంతువులు (Wild Animals) వాటి వల్ల ప్రమాదాలకు గురవుతున్నాయి. చాలా జంతువులు బావులు, గోతుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. కొన్ని జంతువులు మాత్రమే ప్రాణాలతో బయటపడుతున్నాయి. తాజాగా ఓ ఏనుగు (Elephant) బావిలో పడి అటవీ సిబ్బంది సహాయంతో బయటకు వచ్చింది (Elephant Videos).

IFS అధికారి సుశాంత నంద ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో బావిలో పడిన ఏనుగు గురించి సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి ఎక్స్‌కవేటర్‌తో సహా చేరుకున్నారు. బావి నుంచి ఏనుగు బయటకు వచ్చేందుకు మార్గాన్ని నిర్మించారు. ఆ మార్గం గుండా నడుచుకుంటూ ఏనుగు బయటకు వచ్చింది. పూర్తిగా బయటకు వచ్చాక సిబ్బంది వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. అనంతరం నేరుగా అడవిలోకి వెళ్లిపోయింది (Elephant rescued from well).

Viral: ``నేను అందంగా ఉన్నానా.. అయితే ఫోన్ చేయండి``.. విజిటింగ్ కార్డులు పంచుతూ ఒక అమ్మాయి వినూత్న అభ్యర్థన!

ఈ ఘటన ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వీడియో (Elephant Videos) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 32 వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఏనుగును కాపాడిన రెస్క్యూ టీమ్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అటవీ పరివాహక ప్రాంతాల్లోని బావులన్నింటినీ మూసెయ్యాలని కోరుతూ ట్వీట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-19T15:57:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising