ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Elephant: బస్సును అడ్డగించి.. అద్దాలను తుడిచి..

ABN, First Publish Date - 2023-04-04T08:52:53+05:30

తిరుప్పూరు(Tiruppur) జిల్లా ఉడుమలైలో గత కొద్ది రోజులుగా స్థానికులను భయపెడుతూ వచ్చిన పడయప్పా అడవి ఏనుగు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చెన్నై, (ఆంధ్రజ్యోతి): తిరుప్పూరు(Tiruppur) జిల్లా ఉడుమలైలో గత కొద్ది రోజులుగా స్థానికులను భయపెడుతూ వచ్చిన పడయప్పా అడవి ఏనుగు సోమవారం వేకువజామున కేరళ బస్సును అడ్డగించింది. ఆ ఏనుగును(Elephant) చూసి ప్రయా ణికులంతా భయాందోళనకు గురయ్యాయి. ఆ ఏనుగు ఎవరికీ ఎలాంటి హాని కలిగించకుండా బస్సు ముందువైపు అద్దాలను తన తొండంతో శుభ్రపరచి తిరిగి వెళ్ళింది. ఈ సంఘటన కేరళ మునారు ప్రాంతం నుండి 30 మంది ప్రయాణికులతో ఆదివారం అర్ధరాత్రి బయలుదేరిన కేరళ ప్రభుత్వ రవాణా బస్సు సోమవారం వేకువజాము కన్నిమలై ఎస్టేట్‌(Kannimalai Estate) ప్రాంతంలో వెళుతుండగా రోడ్డుకు అడ్డంగా నడచివస్తున్న పడయప్పా ఏనుగు కనిపించింది. దీనితో బస్‌ డ్రైవర్‌ వెంటనే బస్సును నిలిపివేశాడు. ఆ ఏనుగు బస్సువైపు పరుగులు తీసుకుంటూ రావటంతో ప్రయాణికులంతా భయపడ్డారు. అయితే ఆ ఏనుగు ఎవరికీ హాని చేయకుండా బస్సు ముందువైపు అద్దాలను తొండంతో పలుమార్లు తుడిచి తోకను ఊపుకుంటూ తిరిగి వెళ్ళింది. అప్పటిదాకా ఆ ఏనుగు తమకు హానిచేస్తుందని ఊపిరిబిగబట్టి ఆందోళన చెందిన ప్రయాణికులంతా ఊరట చెందారు.

Updated Date - 2023-04-04T08:52:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising