Crime News: ప్రభుత్వ పథకం కింద ఫ్రీ మొబైల్ ఇస్తామంటూ.. ఇంటికి వెళ్లి చెప్పిన ఉద్యోగి.. బాలిక ఎంతో సంతోషంతో వెనుకే వెళ్లగా..
ABN, First Publish Date - 2023-08-13T18:18:52+05:30
ప్రజా సంక్షేమ పథకాలను కొందరు తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం తరచూ చూస్తూ ఉంటాం. లబ్ధిదారులకు అందాల్సిన నిధులను కొందరు పక్కదారి పట్టిస్తుంటే.. మరికొందరు చేయని పనులనూ చేసినట్లుగా చూపి అక్రమార్జనకు దిగుతుంటారు. అయితే ఇంకొందరు మాత్రం ఇదే పథకాల పేరుతో...
ప్రజా సంక్షేమ పథకాలను కొందరు తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం తరచూ చూస్తూ ఉంటాం. లబ్ధిదారులకు అందాల్సిన నిధులను కొందరు పక్కదారి పట్టిస్తుంటే.. మరికొందరు చేయని పనులనూ చేసినట్లుగా చూపి అక్రమార్జనకు దిగుతుంటారు. అయితే ఇంకొందరు మాత్రం ఇదే పథకాల పేరుతో ఎవరూ ఊహించని దారుణాలకు తెగబడుతుంటారు. తాజాగా, రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ పథకం కింద ఫ్రీ మొబైల్ ఇస్తామంటూ.. ఉద్యోగి ఓ ఇంటికి వెళ్లి మరీ బాలికతో చెప్పాడు. దీంతో ఆమె ఎంతో సంతోషంగా అతడి వెంట వెళ్లింది.. చివరకు ఏం జరిగిందంటే..
రాజస్థాన్ (Rajasthan) గంగాపూర్ జిల్లా తోడభీమ్ ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని మహిళలు, బాలికలకు ఉచిత మొబైల్స్ (Free mobiles for women) ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పథకాన్ని ఓ ఉద్యోగి తన స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకున్నాడు. నీటి సరఫరా విభాగంలో క్యాషియర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి.. ఇటీవల ఇదే ప్రాంతంలోని ఓ 17 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్లాడు. బాలిక (girl) ఒక్కటే ఉండడం చూసి.. ‘‘మీకు ప్రభుత్వ పథకం నుంచి ఉచిత మొబైల్ మంజూరైంది. నాతో పాటూ వస్తే ఇచ్చేస్తా’’.. అని చెప్పాడు. దీంతో బాలిక ఎంతో సంతోషించింది.
ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పాలని అనుకుంది. కానీ అంతలో అతను.. ‘‘మీ అమ్మకు తర్వాత చెప్పు.. త్వరగా వచ్చి తీసుకోకపోతే మళ్లీ అయిపోయే ప్రమాదం ఉంది’’.. అని అన్నాడు. దీంతో బాలిక చివరకు ఉద్యోగి వెంటే వెళ్లింది. ఆమెను బైకులో ఎక్కించుకున్న అతను నేరుగా తన గదికి తీసుకెళ్లాడు. లోపలికి వెళ్లాక తలుపులు వేసి బలత్కారాం చేశాడు. ఇందుకు బాలిక అంగీకరించకపోవడంతో దాడి చేశాడు. ఆమెపై అఘాయిత్యానికి (Misbehavior with a girl) పాల్పడిన అనంతరం సమీప ప్రాంతంలో వదిలేసి వెళ్లాడు. జరిగిన దారుణాన్ని బాలిక తన తల్లిదండ్రులకు తెలియజేసింది. అంతా కలిసి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు.. ఉద్యోగిని పట్టుకుని చెట్టకు కట్టేసి చితకబాదారు. పోలీసులు అక్కడికి చేరుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తీసుకెళ్లారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-08-13T18:18:52+05:30 IST