Credit Card: శాలరీ ప్రూఫ్ లేకున్నా.. మీరు అసలు జాబ్ చేయకపోయినా క్రెడిట్ కార్డు ఎలా పొందొచ్చంటే..!
ABN, First Publish Date - 2023-09-30T19:45:30+05:30
ఇప్పటికీ చాలా మందికి క్రెడిట్ కార్డుల విషయంలో వివిధ రకాల సందేహాలు ఉంటాయి. ప్రధానంగా క్రెడిట్ కార్డు కావాలంటే శాలరీ ప్రూఫ్ కావాలేమో అని అనుకుంటూ ఉంటారు. అయితే శాలరీ ప్రూఫ్ లేకున్నా, అసలు జాబ్ చేయకపోయినా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం..
ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ రకాల ఉద్యోగాలు చేసే వారిలో చాలా మంది క్రెడిట్ కార్డులు వాడటం సర్వసాధారణమైపోయింది. కొందరైతే అరకొర శాలరీలతో జీవితాలను నెట్టుకొస్తుంటారు. దీంతో డబ్బులు అవసరమైన సమయంలో అప్పులు చేయడమో, లేదా క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకోవడమో చేస్తుంటారు. అయితే ఇప్పటికీ చాలా మందికి క్రెడిట్ కార్డుల విషయంలో వివిధ రకాల సందేహాలు ఉంటాయి. ప్రధానంగా క్రెడిట్ కార్డు కావాలంటే శాలరీ ప్రూఫ్ కావాలేమో అని అనుకుంటూ ఉంటారు. అయితే శాలరీ ప్రూఫ్ లేకున్నా, అసలు జాబ్ చేయకపోయినా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం..
క్రెడిట్ కార్డుల జారీ ప్రక్రియలో గతంలో పలు రకాల నిబంధనలు ఉండేవి. అయితే మారుతున్న కాలనికి తగ్గట్టుగా మనిషి అవసరాలు కూడా పెరిగిపోయాయి. దీంతో క్రెడిట్ కార్డుల వినియోగం కూడా పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా బ్యాంకులు.. క్రెడిట్ కార్డుల జారీకి సంబంధించిన నిబంధనలను సడలించాయి. ప్రస్తుతం అనేక బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (Fixed Deposits) సురక్షిత క్రెడిట్ కార్డ్ పేరుతో క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఈ రకమైన కార్డులలో డిపాటిజ్ చేసిన మొత్తంలో 75 నుంచి 80 శాతం వరకు పరిమితి ఉంటుంది.
Amazon Sale: వాటిపై ఏకంగా 75 శాతం డిస్కౌంట్.. అమెజాన్ సేల్‌లో ఏఏ వస్తువులపై భారీ ఆఫర్లు ఉన్నాయంటే..!
బ్యాంకు అకౌంట్ బ్యాలెన్స్ ఆధారంగా కూడా కొన్ని ఆర్థిక సంస్థలు క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. బ్యాంకులో ఖాతాలో నగదు నిల్వకు సంబంధించిన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. ట్రాన్షక్షన్స్ ఎక్కువ చేయడంతో పాటూ ఖాతాలో ఎక్కువ మొత్తంలో డిపాజిట్ అవుతున్నట్లయితే దాని ఆధారంగా క్రెడిట్ కార్డులు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ చూపించడం ద్వారా కూడా క్రెడిట్ కార్డు పొందొచ్చు. అయితే కార్డు తీసుకున్నాక బకాయిలు సకాలంలో చెల్లించని పక్షంలో సదరు బ్యాంకులు మ్యూచువల్ ఫండ్స్ నుంచి వసూలు చేసుకుంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
శాలరీ ప్రూప్ లేకుండా క్రెడిట్ కార్డు తీసుకునేందుకు మరో పద్ధతి కూడా ఉంది. భర్త లేదా భార్య ఇద్దరిలో ఎవరో ఒకరి ఆదాయ రుజువును సమర్పించి క్రెడిట్ కార్డులు తీసుకోవచ్చు. అలాగే గతంలో మీరు క్రెడిట్ వాడి ఉన్నట్లయితే.. దాని ఆధారంగా కూడా కొత్త క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. అయితే గతంలో మీరు చెల్లింపులు చేసిన విధానాన్ని బట్టి బ్యాంకు వారు ఓ అంచనాకు వస్తారనే విషయం గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డు పొందాలంటే ఎవరికైనా బ్యాంకు ఖాతా తప్పనిసరి. క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసే సమయంలో మీ బ్యాంకు ఖాతా వివరాలను (Bank account details) సమర్పించాల్సి ఉంటుంది.
Updated Date - 2023-09-30T19:45:30+05:30 IST