ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: ఈ ఫొటోలోని మహిళ వయసెంతో అంచనా వేయగలరా..? చూడటానికి కాలేజీ అమ్మాయిలా కనిపిస్తోంది కానీ..!

ABN, First Publish Date - 2023-05-06T18:40:54+05:30

బాడీని ఫిట్‌గా ఉంచుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కొందరు తాము అనుకున్న విధంగా తమ శరీరాకృతిని మార్చుకుంటుంటారు. మరికొందరు మాత్రం మూన్నాళ్ల ముచ్చటగా.. మొదట్లో గంటల తరబడి వ్యాయామం చేసినా మధ్యలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాడీని ఫిట్‌గా ఉంచుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కొందరు తాము అనుకున్న విధంగా తమ శరీరాకృతిని మార్చుకుంటుంటారు. మరికొందరు మాత్రం మూన్నాళ్ల ముచ్చటగా.. మొదట్లో గంటల తరబడి వ్యాయామం చేసినా మధ్యలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం మానేస్తారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ ఇందుకు పూర్తిగా విరుద్ధం. క్రమం తప్పకుండా జిమ్‌లో కసరత్తులు చేయడమే కాకుండా ఆహార అలవాట్లపై కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంటోంది. ప్రస్తుతం ఈమెను చూసి అంతా కాలేజీ స్టూడెంట్ అనుకుంటున్నారు. కానీ ఆమె వయస్సు తెలుసుకుని చివరకు అవాక్కవుతున్నారు. ఈమెకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆస్ట్రేలియాలోని (Australia) మెల్‌బోర్న్‌కు చెందిన లెస్లీ మాక్స్‌వెల్ అనే మహిళ (woman) ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. లెస్లీకి యుక్త వయసు వచ్చినప్పటి నుంచి శరీర దారుఢ్యంపై ఆసక్తి కలిగింది. అయితే వివిధ కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చింది. ఎట్టకేలకు తన 48వ ఏట మొదటిసారిగా జిమ్ (Gym) చేయడం మొదలెట్టింది. ఇక అప్పటి నుంచి క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ వచ్చింది. కేవలం జిమ్ చేయడమే కాకుండా ఆహార అలవాట్లపై (Food habits) కూడా ఎంతో శ్రద్ధ వహించేది. తన రోజు వారీ ఆహారంలో అధిక ప్రొటీన్, తక్కువ కార్బొహైటడ్రేట్లు ఉండేలా చూసుకునేది. వేయించిన వస్తువులను పూర్తిగా పక్కన పెట్టేసింది.

Skeleton: ఎముకల గూడులా మృతదేహం.. పక్కనే సగం కాలిన స్మార్ట్‌ఫోన్.. లోపల సిమ్ కార్డు మాత్రం సేఫ్.. అసలు ఆ శవం ఎవరిదో తెలిసి..!

జిమ్‌లో చేరిన ఏడాది తర్వాత 48 ఏళ్ల వయసులో లెస్లీ మొదటి సారి బికినీ షో చేసింది. ఆమెను చూసిన వారంతా మహా అయితే 25 లేదా 30ఏళ్ల వయస్సు ఉంటుందని అనుకున్నారు. చివరకు ఆమె వయసు తెలుసుకుని అంతా అవాక్కయ్యే వారు. ఇంత ఫిట్‌నెస్ ఎలా వచ్చిందంటూ పదే పదే సందేహాలు అడుగుతూ.. ఆమె చెప్పే టిప్స్‌ను పాటించేవారు. లెస్లీ అనంతర కాలంలో జిమ్ ట్రైనర్‌గా (Gym trainer) వ్యవహరిస్తూ.. తోటి మహిళలకు బాడీ ఫిట్‌నెస్‌పై (Body fitness) సలహాలు, సూచనలు ఇస్తూ వచ్చింది. ఇక 50 ఏళ్ల వయసులో లెస్లీ తన భర్త నుంచి విడిపోయింది. అప్పటికి ఆమెకు ముగ్గురు మనువళ్లు ఉన్నారు.

Marriage: పెళ్లయిన 3 గంటల తర్వాత బాత్రూంకు వెళ్లిన వరుడు.. తిరిగొచ్చి కుర్చీలో కూర్చుని అక్కడికక్కడే మృతి.. అసలేం జరిగిందంటే..!

భర్త నుంచి విడిపోయాక.. లెస్లీ ఫిట్‌నెస్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. చాలా మంది యువకులు లెస్టీ వయసు తక్కువగా భావించి స్నేహం చేసేవారు. ఆమె తన వయసులో సగం మందితో డేటింగ్ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం లెస్లీకి 65 ఏళ్లు వచ్చినా శరీరాకృతిలో మాత్రం ఇప్పటికీ యువతిలాగే కనిపిస్తుండడం చూసి అంతా ఆశ్చర్యపోతుంటారు. ఈమెకు సోషల్ మీడియాలో (Social media Followers) కూడా లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు వారితో టచ్‌లో ఉంటూ సలహాలు, సూచనలు (Advice and suggestions) ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం వారంలో 5 రోజులు జిమ్ చేయడం, మిగతా రెండు రోజులు పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నానని లెస్లీ చెబుతోంది.

Indian Railway: రైలు ఎక్కి సీట్లో కూర్చున్న మరుక్షణమే ఉలిక్కిపడ్డ కుర్రాడు.. దిగ్గున లేచి సీట్లో ఏముందో చూసి షాక్.. చివరకు..!

Updated Date - 2023-05-06T18:40:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising