14 ఏళ్ల బాలికకు పదే పదే కడుపునొప్పి.. మాత్రలు వాడినా ఫలితం లేక ఆస్పత్రికి.. స్కానింగ్ చేశాక డాక్టర్లు చెప్పింది విన్న తల్లిదండ్రులకు..
ABN, First Publish Date - 2023-03-30T19:25:05+05:30
ఒక సమస్యతో ఆస్పత్రికి వెళ్తే.. కొన్నిసార్లు అనేక సమస్యలు బయటపడుతుంటాయి. కొందరు రోగులు విచిత్రమైన సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా సమస్య మాత్రం పరిష్కారం కాదు. అయితే కొన్నిసార్లు సమస్యకు అసలు కారణం తెలుసుకుని..
ఒక సమస్యతో ఆస్పత్రికి వెళ్తే.. కొన్నిసార్లు అనేక సమస్యలు బయటపడుతుంటాయి. కొందరు రోగులు విచిత్రమైన సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా సమస్య మాత్రం పరిష్కారం కాదు. అయితే కొన్నిసార్లు సమస్యకు అసలు కారణం తెలుసుకుని డాక్టర్లు కూడా షాక్ అవుతుంటారు. ఇలాంటి కేసులకు సంబంధించిన వార్తలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, 14 ఏళ్ల బాలికకు ఇలాంటి వింత సమస్య వచ్చిపడింది. ఎన్ని మాత్రలు వాడినా కడుపు నొప్పి తగ్గకపోవడంతో చివరకు పెద్దాసుపత్రికి వెళ్లారు. స్కానింగ్ చేశాక డాక్టర్లు చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బిజ్నోర్ పరిధి సబ్జీ మండి ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలిక (girl) .. ఎనిమిదేళ్ల వయసు వరకూ అందరి పిల్లల్లాగే ఉండేది. అయితే అనంతరం కాలంలో ఆమెకు వింత సమస్య వచ్చి పడింది. రాపంజెల్ సిండ్రోమ్ (Rapunzel syndrome) అనే సమస్య కారణంగా ట్రైకోవైరస్ బారిన పడింది. అప్పటి నుంచి క్రమక్రమంగా వెంట్రుకలను తినడం మొదలుపెట్టింది. ఈ కారణంగా మొన్నటిదాకా ఎలాంటి సమస్య లేకున్నా.. ఆమె శరీరం మాత్రం అభివృద్ధి చెందలేదు. దీంతో పాటూ అనంతర కాలంలో ఏం తిన్నా వాంతి చేసుకుంటూ ఉండేది. నెలలు గడిచే కొద్దీ ఆ సమస్యలతో పాటూ కడుపు నొప్పి కూడా మొదలైంది. ఎన్ని మాత్రలు మింగినా నొప్పి దగ్గకపోగా ఇంకా పెరుగుతూ వచ్చింది.
ఈ క్రమంలో తల్లిదండ్రులు ఆమెను ఎన్నో ఆస్పత్రుల్లో (Hospitals) చూపించినా ఫలితం లేకుండ పోయింది. మంగళవారం కడుపు నొప్పి (Stomach ache) తీవ్రమవడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు.. ఆమె కడుపులో పెద్ద సైజులో వెంట్రుకల కట్ట ఉండడం చూసి షాక్ అయ్యారు. చివరకు ఆపరేషన్ చేసి 2.5కిలోల వెంట్రుకల కట్టను (bundle of hair) బయటకు తీశారు. వెంట్రుకలు జీర్ణం కావడం కష్టమని, దీంతో ఏళ్ల పాటు తిన్న వెంట్రుకలన్నీ ఉదర కుహరంలో పేరుకుపోయాయని వైద్యులు తెలిపారు. రాపంజెల్ సిండ్రోమ్‌తో బాధపడే వారికి.. కంపల్సివ్ ఈటింగ్, స్కిజోఫ్రెనియా, PTSD, ADHD, డిప్రెషన్, అనోరెక్సియా నెర్వోసా తదితర మానసిక సమస్యలు (Psychological problems) కూడా ఎదురవుతుంటాయని వారు పేర్కొన్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్చ చర్చనీయాంశంగా మారింది.
Updated Date - 2023-03-30T19:25:05+05:30 IST