Girls Hostel: లేడీస్ హాస్టల్‌లో వింత పరిణామం.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు చూసి అంతా షాక్.. రోజూ రాత్రిళ్లు ఒంటి గంట దాటగానే..!
ABN, First Publish Date - 2023-04-19T17:39:58+05:30
బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారు కొందరైతే, ప్రేమ పేరుతో వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టే వారు మరికొందరు ఉంటారు. ఇక హాస్టళ్లలో ఉండే బాలికలైతే నిత్యం వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటుంటారు. లేడీస్ హాస్టళ్లలో చోటు చేసుకునే..
బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారు కొందరైతే, ప్రేమ పేరుతో వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టే వారు మరికొందరు ఉంటారు. ఇక హాస్టళ్లలో ఉండే బాలికలైతే నిత్యం వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటుంటారు. లేడీస్ హాస్టళ్లలో చోటు చేసుకునే వింత వింత పరిణామాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ హాస్టల్‌లో చోటు చేసుకున్న వింత ఘటనకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. రాత్రిళ్లు ఒంటి గంట దాటగానే ఆ హాస్టల్లో వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చివరకు సీసీ కెమెరాలను పరిశీలించగా షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
బాధితులు, పోలీసుల కథనం మేరకు.. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో (Haryana Karnal district) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక మోడల్ టౌన్‌లో ఉన్న హాస్టల్‌లో (Girls Hostel) సుమారు 35మంది బాలికలు ఉంటున్నారు. ఇదిలావుండగా, నెల రోజులుగా ఈ హాస్టల్‌లో వింత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బాలికలు ఓ రోజు మరుగుదొడ్లలో (Toilets) పరిశీలించి చివరకు షాక్ అయ్యారు. అంతవరకూ అక్కడే ఉన్న దుస్తులు (girls clothes) రాత్రికి రాత్రి మాయమవడం చూసి ఖంగుతిన్నారు. మొదట్లో వారికి ఎలాంటి అనుమానమూ రాలేదు. అయితే తరచూ ఇలాగే దుస్తులు మాయమవుతుండడంతో అనుమానం వచ్చింది.
హాస్టల్ భవనం వెనుక ఉన్న ఇంటి యజమాని వద్దకు వెళ్లారు. వారి ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించాల్సిందిగా కోరారు. వీడియోలు చూసిన బాలికలతో పాటూ సదరు ఇంటి యజమాని కూడా షాక్ అయ్యాడు. రోజూ రాత్రి 1గంట దాటాక హాస్టల్ వార్డెన్.. మరుగుదొడ్లలోకి వెళ్లి, బాలికల దుస్తులను ఎత్తుకెళ్తున్నట్లు గుర్తించారు. అలాగే గోడలకు రంధ్రాలు చేసి వీడియోలు (Indecent videos) కూడా తీస్తున్నట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. దుస్తుల చోరీకి సంబంధించి చాలా రోజులుగా తమకు ఫిర్యాదులు అందుతున్నాయని పోలీసులు తెలిపారు. పూర్తి విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.
Updated Date - 2023-04-19T17:39:58+05:30 IST