ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Buying a Car: కారును కొనే ఆలోచనలో ఉన్నారా..? అయితే ముందే ఈ 20/4/10 రూల్‌ను తెలుసుకోండి..!

ABN, First Publish Date - 2023-09-16T19:05:11+05:30

ఒకప్పుడు కారు కొనడమంటే అది అత్యంత ధనవంతులకు మాత్రమే సాధ్యమయ్యేది. అయితే మారుతున్న కాలానికి అనుకుగుణంగా ప్రస్తుతం సామాన్యులు కూడా కారు కొనే పరిస్థితికి వచ్చారు. చిన్న చిన్న వ్యాపారులు మొదలుకొని, మంచి మంచి జీతాలకు ఉద్యోగాలు చేసేవారంతా విధిగా..

ఒకప్పుడు కారు కొనడమంటే అది అత్యంత ధనవంతులకు మాత్రమే సాధ్యమయ్యేది. అయితే మారుతున్న కాలానికి అనుకుగుణంగా ప్రస్తుతం సామాన్యులు కూడా కారు కొనే పరిస్థితికి వచ్చారు. చిన్న చిన్న వ్యాపారులు మొదలుకొని, మంచి మంచి జీతాలకు ఉద్యోగాలు చేసేవారంతా విధిగా కారు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తద్వారా ప్రతి నెలా శాలరీ నుంచి ఈఎమ్‌ఐ కట్టుకుంటూ తమ కోరికను నెరవేర్చుకుంటున్నారు. అయితే చాలా మందికి కారు కొనడంలో కొన్ని సందేహాలు ఉంటాయి. కారులో కొనే ఆలోచనలో ఉన్న వారు 20/4/10 రూల్‌ను విధిగా తెలుసుకోవాల్సి ఉంది. ఇంతకీ ఈ రూల్ ఏం చెబుతోందంటే..

ప్రస్తుతం చాలా బ్యాంకులు.. వారి వారి సిబిల్ స్కోరును (Sibyl Score) బట్టి కారు లోన్లను (Car Loans) ఆఫర్ చేస్తున్నాయి. అలాగే ఎన్నో రకాల వాహనాలు వివిధ రకాల ధరల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. 20/4/10 నియమ నిబంధనలు అనుసరించడం ద్వారా.. కారు కోసం ఎంత ఖర్చు చేయాలి తదితర వివరాలపై అవగాహన ఉంటుంది. కారు కోనే వారు సరైన నిర్ణయాలు తీసుకునేలా ఇందులో ఫార్ములాను రూపొందించారు. దీన్ని బట్టి కారు కోసం ఎంత డౌన్ పేమెంట్ చేయాలి, లోన్ వ్యవధి, నెలవారీ ఖర్చులు తదితర అంశాలన్నీ ఇందులో పొందుపరచి ఉంటాయి. వివరాల్లోకి వెళితే...


  • కారుకు అయ్యే మొత్తంలో కనీసం 20% నగదును ముందుగా చెల్లించాలి. దీని వల్ల రుణ మొత్తం తగ్గడంతో పాటూ నెల వారీ చెల్లింపులు కూడా తగ్గుతాయి. తద్వారా కారు విలువ కంటే ఎక్కువ భారం కాకుండా ఉంటుంది. కారుకు సంబంధించిన రుణ కాల వ్యవధి నాలుగేళ్ల వరకూ ఉండేలా చూసుకోవాలి. తక్కువ రుణాలు వడ్డీపై డబ్బును ఆదా చేయడంతో పాటూ దీర్ఘకాలిక ఆర్థికి ఒత్తిడిని నివారిస్తాయి.

  • అలాగే మీ మొత్తం నెలవారీ ఖర్చులు, రుణ చెల్లింపులు, బీమా నిర్వహణ తదితరాలు మీ నెల వారీ ఆదాయంలో 10% కంటే ఎక్కువ ఉండకూడదు. తద్వారా మీకు కారు కోనే సామర్థ్యం ఉందని, కారు ఈఎమ్‌ఐలతో పాటూ ఇతర ఖర్చులను కూడా భరించే స్థాయి మీకు ఉందని దీని ద్వారా అర్థమవుతుంది.

  • కారు ధర తప్పనిసరిగా మీ వార్షిక ఆదాయంలో 50% కంటే తక్కువగా ఉండాలి. ఉదాహరణకు.. మీరు ఏడాదికి రూ.15లక్షలు సంపాదిస్తే.. మీ కారు ధర రూ.7.5లక్షలు ఉండాలి. అలా కాకుండా అంతకుమించి లక్షలు విలువ చేసే కారును కొనుగోలు చేస్తే.. మీరు 20/4/10 నియబంధనల పరిధిని మించిపోయారని అర్థం.

  • మీ ఆర్థిక పరిస్థిని అంచనా వేసుకుని తద్వారా మీరు కారు కోసం ఎంత ఖర్చు చేయగలరో చూసుకోవాలి. ఇందుకోసం మీ ఆదాయం, నెలవారీ ఖర్చులను బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ బడ్జెట్‌లో విభిన్న రకాల కార్ల కోసం అన్వేషించాలి. అలాగే కారు ఇంధనం, మరమ్మతులు తదితర ఖర్చులన్నీ మీ బడ్జెట్‌ను మించిపోకుండా ముందే జాగ్రత్తపడాలి.

  • సాధ్యమైనంత వరకూ కొత్త కార్లను కాకుండా.. తక్కువ కాలం వాడిన వాహనాలను కొనేలా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఉన్న కారును మార్చే అంశంలో కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. వీలైనంత వరకూ కారును ఎక్కువ కాలం వాడుకోవాలి. ఒకవేళ విధిగా కొత్త కారు కొనాల్సి వస్తే.. ఇందుకోసం ముందు నుంచే పొదుపు చేసుకోవాలి.

  • మీకు తక్కువ ఆదాయం ఉండడడంతో పాటూ ఇప్పటికే అప్పులు ఉన్నట్లయితే 20/4/10 నియమాలకు కట్టుబడి ఉండడం సవాలుగా మారవచ్చు. ఇలాంటి సందర్భంలో మీ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నియమాన్ని సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్ పేమెంట్ ఎక్కువ చెల్లించడం ద్వారా కారు లోన్ మొత్తాన్ని తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

Sourabh Chandrakar: ఎవరీ చంద్రశేఖర్..? గల్ఫ్ గడ్డపై పెళ్లి కోసం రూ.200 కోట్ల ఖర్చు.. క్యూ కట్టిన బాలీవుడ్ సెలబ్రెటీలు..!

Updated Date - 2023-09-16T19:05:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising