Indian Railway: సచిన్ పేరుతో రైల్వే స్టేషన్.. సునీల్ గవాస్కర్ పోస్ట్.. అసలు ఇది ఎక్కడ ఉందో తెలుసా..?
ABN, First Publish Date - 2023-11-29T14:59:40+05:30
క్రికెట్ చరిత్రలో సునిల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిలో సునిల్ గవాస్కర్ లిటిల్ మాస్టర్‌గా పేరుగాంచి ఎన్నో రికార్డులు సాధిస్తే.. మరోవైపు...
క్రికెట్ చరిత్రలో సునిల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిలో సునిల్ గవాస్కర్ లిటిల్ మాస్టర్‌గా పేరుగాంచి ఎన్నో రికార్డులు సాధిస్తే.. మరోవైపు సచిన్ మాస్టర్ బ్లాస్టర్‌గా సెంచరీల మీద సెంచరీల చేసి క్రికెట్ దేవుడిగా మారాడు. అలాంటి సచిన్ క్రికెట్ చరిత్రలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న విషయం తెలిసిందే. అయితే సచిన్ పేరు మీద ఓ రైల్వే స్టేషన్ ఉందనే విషయం చాలా మందికి తెలీదు. తాజాగా, సునిల్ గవాస్కర్ సదరు రైల్వే స్టేషన్ ఫొటోను షేర్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ స్టేషన్ ఎక్కడుందంటే..
సచిన్ టెండూల్కర్‌ని చూసి ఈ రైల్వే స్టేషన్‌కు (Sachin Railway Station) పేరు పెట్టకున్నా.. చూడగానే సచిన్ గుర్తొచ్చేలా ఉండడంతో సునిల్ గవాస్కర్‌ను ఆకట్టుకుంది. ఇటీవల గుజరాత్‌లో (Gujarat) పర్యటించిన సునీల్ గవాస్కర్.. రైల్వే స్టేషన్‌పై సచిన్ పేరు చూసి సంబరపడిపోయాడు. వెంటనే ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తన అభిమాన క్రికెటర్ అయిన సచిన్ పేరుతో రైల్వే స్టేషన్ ఉండడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపాడు. ‘‘గత శతాబ్దపు వాళ్లకు ఎంతో ముందు చూపు ఉన్నట్లుంది... రాబోయే రోజుల్లో క్రికెట్లో సచిన్ సంచలనం సృష్టిస్తాడని ముందే ఊహించి, ఈ పేరు పెట్టినట్లున్నారు’’.. అని పేర్కొన్నారు.
Marriage: పెళ్లికి సరిగ్గా ఒక్క రోజు ముందు ఈ వరుడు ఇలా చేశాడేంటి..? వధువుకు అసలు విషయం తెలిసి..!
సచిన్ తన ఫేవరెట్ క్రికెటర్ మాత్రమే కాకుండా ఫేవరెట్ పర్సన్ అని గవాస్కర్ (Sunil Gavaskar) వ్యాఖ్యానించారు. ఈ సచిన్ రైల్వే స్టేషన్ గుజరాత్‌లోని సూరత్‌లో (Surat) ముంబై, అహ్మదాబాద్, జైపూర్, ఢిల్లీని కలిపే ప్రధాన మార్గంలో ఉంది. ఈ స్టేషన్‌లో మొత్తం 3 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. కాగా, ప్రస్తుతం సునిల్ గవాస్కర్ పోస్టు చేసిన ఫొటో (Viral photo) నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఇద్దరూ గ్రేట్ క్రికెటర్స్’’.. అంటూ కొందరు, ‘‘వెల్‌కమ్ టూ సచిన్’’.. అంటూ మరికొందరు, ‘‘గాడ్ ఆఫ్ క్రికెట్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం 65వేలకు పైగా లైక్‍లను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-11-29T14:59:47+05:30 IST