Viral Video: నాన్నా.. కొత్త షూ కొన్నానంటూ కొడుకు తెచ్చిచ్చాడో పార్శిల్.. ఖరీదెంతో చెప్పాక ఆ తండ్రి రియాక్షన్ చూస్తే..!
ABN, First Publish Date - 2023-07-26T16:03:57+05:30
ప్రస్తుతం యువత ట్రెండ్‌కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నారు. ఇక ఫ్యాషన్ విషయంలో అయితే తగ్గేదేలే.. అన్నట్లుగా ఒకరిని మించి మరొకరు పోటీపడుతుంటారు. హెయిర్ స్టైల్ దగ్గర నుంచి దుస్తులు, చెప్పుల వరకూ ఖర్చుకు వెనుకాడకుండా బ్రాండెడ్ వస్తువులను కొంటున్నారు. ఇక ధనవంతుల పిల్లలైతే...
ప్రస్తుతం యువత ట్రెండ్‌కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నారు. ఇక ఫ్యాషన్ విషయంలో అయితే తగ్గేదేలే.. అన్నట్లుగా ఒకరిని మించి మరొకరు పోటీపడుతుంటారు. హెయిర్ స్టైల్ దగ్గర నుంచి దుస్తులు, చెప్పుల వరకూ ఖర్చుకు వెనుకాడకుండా బ్రాండెడ్ వస్తువులను కొంటున్నారు. ఇక ధనవంతుల పిల్లలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ తండ్రీ కొడుకులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ‘‘నాన్నా.. కొత్త షూ కొన్నాను’’.. అంటూ కొడుకు పార్శిల్ చూపించాడు. దాని ఖరీదు తెలుసుకుని తండ్రి నోరెళ్లబెట్టాడు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ యువకుడు కొత్త షూ (new shoe) కొని ఇంటికి తీసుకెళ్తాడు. మంచంపై కూర్చుని ఉన్న తండ్రి వద్దకు వెళ్లి.. ‘‘నాన్నా.. కొత్త షూ కొన్నాను.. ఎలా ఉన్నాయో చూడు’’.. అంటూ చేతికి ఇస్తాడు. వాటిని బయటికి తీసి, అటూ ఇటూ తిప్పి చూసిన తండ్రి.. చివరగా ‘‘ఇంతకీ వీటి ధర ఎంత’’.. అని అడుగుతాడు. ‘‘నాలుగు లక్షల రూపాయలు నాన్నా’’.. అని కొడుకు చెప్పగానే.. తండ్రి కళ్లు బయర్లు కమ్మాయి. ‘‘నాలుగు లక్షలా.. ఇవేం బూట్లురా నాయనా.. నీకో దండం, నీకో బూట్లకో దండం’’.. అంటూ చేతులెత్తి మొక్కుతాడు.
Viral Video: సింహం ముందే దూడను కొమ్ములతో ఎత్తిపడేసిన తల్లి గేదె.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సదరు యువకుడు ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో (Viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు (Funny comments) చేస్తున్నారు. ‘‘వామ్మో! ఈ షూలు మరీ ఇంత రేటా’’.. అంటూ కొందరు, ‘‘తల్లిదండ్రులకు పిల్లలెవరూ అసలు ధర చెప్పరు’’.. అని మరికొందరు, ‘‘ ఇలాంటివి.. మా ఊరి సంతలో రూ.500లకే వస్తాయి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం రెండు లక్షలకు పైగా లైకులను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-07-26T16:03:57+05:30 IST