Marriage: అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే రెండ్రోజుల క్రితమే ఈ కుర్రాడి పెళ్లి జరిగి ఉండేది.. పెళ్లికి కొద్ది గంటల ముందు జరిగిన ఒక్క ఘటనతో..!
ABN, First Publish Date - 2023-06-01T15:49:51+05:30
విధి చాలా విచిత్రమైంది. ఆనందంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా విషాదం నింపుతుంది. దీంతో అప్పటిదాకా మన కళ్ల ముందు ఉన్న వారు.. ఒక్కసారిగా విగతజీవులుగా మారుతుంటారు. ఇందుకు నిదర్శనంగా మన చుట్టూ నిత్యం ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా...
విధి చాలా విచిత్రమైంది. ఆనందంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా విషాదం నింపుతుంది. దీంతో అప్పటిదాకా మన కళ్ల ముందు ఉన్న వారు.. ఒక్కసారిగా విగతజీవులుగా మారుతుంటారు. ఇందుకు నిదర్శనంగా మన చుట్టూ నిత్యం ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే రెండు రోజుల క్రితం అతడి వివాహం జరగాల్సి ఉంది. అయితే పెళ్లికి కొన్ని గంటల ముందు జరిగిన ఒకే ఒక్క ఘటనతో అంతా తలకిందులైంది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) జర్వాల్ రోడ్ పోలీస్ స్టేషన్ పరిధి బహ్రైచ్‌లోని అత్వా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజ్ కమల్ (21) అనే యువకుడికి జర్వాల్‌లోని కోయిలీపూర్ అథైసా ప్రాంతానికి చెందిన లక్ష్మితో వివాహం (marriage) నిశ్చయమైంది. మే 29న ముహూర్తం ఖరారు చేశారు. వివాహం సందర్భంగా అత్వా నుంచి కోయిలీపూర్ వరకూ ఊరేగింపు (procession) నిర్వహించేందుకు ఏర్పాట్లు ఘనంగా చేశారు. మరోవైపు బంధవులంతా గ్రామానికి చేరుకున్నారు. రాజ్ కమల్ తన స్నేహితులతో కలిసి సరదా సరదాగా గడిపాడు. ఊరేగింపు సందర్భంగా వరుడికి (groom) స్నానం చేయించారు. పెళ్లి దుస్తులు ధరించి, ఊరేగింపునకు సిద్ధమవుతున్న సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
అంతవరకూ ఆనందంగా ఉన్న వరుడు.. ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించి, నేలపై పడిపోయాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. అంతా కంగారుగా పరుగెత్తుకుంటూ వచ్చి.. వరుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను గుండె పోటు (Heart attack) కారణంగా మృతి చెందినట్లు తెలిపారు. ఈ వార్త వినగానే వరుడి తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. శుభమా అంటూ పెళ్లి జరుగుతుంటే, ఇలా జరగడం ఏంటని.. బంధువులంతా కన్నీటిపర్యంతమయ్యారు. వరుడి మరణవార్త విని వధువు గ్రామంలోనూ విషాదచాయలు అలుముకున్నాయి. వివాహం జరగాల్సిన సమయంలో వరుడు రాజ్ కమల్ అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి రావడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు. ఈ ఘటన స్థానింగా సంచలనం సృష్టించింది.
Updated Date - 2023-06-01T15:49:51+05:30 IST