ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lions vs Buffalo: సింహాల గుంపు ఓ వైపు.. దున్నపోతుల గుంపు మరో వైపు.. అడవిలో బిగ్ ఫైటింగ్.. చివరకు..!

ABN, First Publish Date - 2023-09-23T17:10:19+05:30

మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా తల్లి ప్రేమలో ఎలాంటి మార్పూ ఉండదు. పిల్లలకు ఆపద వస్తుందంటే తన ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది. తల్లి ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి నిత్యం మన కళ్ల ముందు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. జంతువుల విషయంలోనూ...

మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా తల్లి ప్రేమలో ఎలాంటి మార్పూ ఉండదు. పిల్లలకు ఆపద వస్తుందంటే తన ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది. తల్లి ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి నిత్యం మన కళ్ల ముందు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. జంతువుల విషయంలోనూ ఇలాంటి ఘటనలు తరచూ చూస్తూ ఉంటాం. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. సింహాల గుంపు, దున్నపోతుల గుంపునకు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ అడవిలో దున్నపోతుల (Buffaloes) మంద సేద తీరుతున్న సమయంలో సింహాల మద వాటిని గమనిస్తుంది. అదును చూసి వాటిలో ఓ పిల్ల గేదెపై ఒక్కసారిగా (lions attack on buffalo) దాడి చేస్తాయి. దీంతో దున్నపోతుల మంద మొత్తం చెల్లాచెదురు అవుతుంది. అయితే తన పిల్లపై సింహాలు దాడి చేయడం చూసిన గేదె సింహాల గుంపు వద్దకు వెళ్లి పోరాడుతుంది. దీంతో మిగతా దున్నపోతులు కూడా దానికి సపోర్టుగా వెళ్తాయి. వాటిని చూసిన సింహాలు కాస్త వెనక్కు తగ్గుతాయి.

Viral Vide: అయ్య బాబోయ్! ఈ యువతి పామును ఎలా పట్టుకుందో చూస్తే.. నొరెళ్లబెట్టాల్సిందే..

అయితే కాసేపటి తర్వాత అదును చూసి.. తల్లి గేదె పైనే టార్టెట్ చేస్తాయి. కొన్ని సింహాలు కలిసి గేదెను ఎటూ కదలకుండా పట్టుకుంటాయి. దాన్ని కాపాడాలని దున్నపోతుల మంద మొత్తం చివరి వరకూ ప్రయత్నిస్తుంది. అయినా సింహాలు మాత్రం గేదెను వదలకుండా గట్టిగా పట్టుకుని ఉంటాయి. చివరకు సింహాల చేతిలో తల్లి గేదె ప్రాణాలు కోల్పోతుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న పర్యాటకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో! ఇది బాధాకరం’’.. అని కొందరు, ‘‘ఇది కదా తల్లి ప్రేమ అంటే’’.. అంటూ మరికొందరు, ‘‘చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కి పైగా వ్యూస్‍‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఓరి దేవుడో.. పెళ్లి రోజే ఇంత రిస్కేంటి..? ఈ వధూవరులు హ్యాపీగా వివాహం చేసుకోకుండా ఇదేం పని..?

Updated Date - 2023-09-23T17:10:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising