ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IIT Students: కుర్చీలతో కొట్టుకుని, తన్నుకుని.. ఐఐటీ స్టూడెంట్ల వీరంగం

ABN, First Publish Date - 2023-10-09T11:35:41+05:30

ఐఐటీ కాన్పూర్(IIT Khanpur) లో వార్షిక స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతోంది. ఈ క్రమంలో రెండు కబడ్డీ జట్ల ఆటగాళ్ల మధ్య ఏదో విషయంపై చిన్న వాగ్వాదం జరిగింది. అది కాస్తా.. ఒకరిద్దరూ పోయి రెండు గ్రూపుల తగాదాగా మారింది. ఇంకేముంది రెండు గ్రూపులు ఒకరినొకరు కొట్టుకున్నారు.

లఖ్ నవూ: ఐఐటీ((IIT)ల్లో చదువుతున్న స్టూడెంట్స్ అంటే ఏమనుకుంటాం? సౌమ్యంగా ఉంటారు.. గొడవల జోలికి అస్సలూ వెళ్లరు అనే కదా! కానీ ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh) లోని కొందరు చేసిన పనులు చూస్తే.. ఇదంతా రివర్స్ అనుకోవాలేమో! రాష్ట్రంలోని ఐఐటీ కాన్పూర్(IIT Khanpur) లో వార్షిక స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతోంది. ఈ క్రమంలో రెండు కబడ్డీ జట్ల ఆటగాళ్ల మధ్య ఏదో విషయంపై చిన్న వాగ్వాదం జరిగింది. అది కాస్తా.. ఒకరిద్దరూ పోయి రెండు గ్రూపుల తగాదాగా మారింది. ఇంకేముంది రెండు గ్రూపుల సభ్యులు ఒకరినొకరు మీద పడి మరీ కొట్టుకున్నారు.


అంతటితో ఆగితే తాము ఐఐటీ స్టూడెంట్స్(Students Fight) ఎలా అవుతామని అనుకున్నారో ఏమో? కుర్చీలకు పని చెప్పారు.. అక్కడితో ఆగకుండా కింద పడి మరీ తన్నుకున్నారు. పిడి గుద్దులు, దొరికిన వస్తువుతో దొరికినట్లు విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇరు వర్గాల స్టూడెంట్స్ కి గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. గొడవకు స్పష్టమైన కారణం తెలియరాలేదు. ఘటన జరుగుతున్న టైంలో మహిళా క్రీడాకారులు భయపడి బయటకి పారిపోతున్న దృశ్యాలు కూడా బయటకి వచ్చాయి. ఈ వీడియోలపై నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.

Updated Date - 2023-10-09T11:38:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising