ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: ఆవుకు డీఎన్‌ఏ టెస్ట్ ఏంటా అని అవాక్కవుతున్నారా..? 70 ఏళ్ల ఓ రైతు రెండేళ్లపాటు పోరాటం చేస్తే..!

ABN, First Publish Date - 2023-05-23T18:00:09+05:30

పశువులు అన్నాక అప్పుడప్పుడు తప్పిపోతుంటాయి. దొరుకుతుంటాయి. కొన్ని వెంటనే దొరికిపోతుంటాయి. మరికొన్ని కొంచెం లేటుగా దొరుకుతాయి. ఇంకొన్ని సార్లు

Viral News
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశువులు అన్నాక అప్పుడప్పుడు తప్పిపోతుంటాయి. దొరుకుతుంటాయి. కొన్ని వెంటనే దొరికిపోతుంటాయి. మరికొన్ని కొంచెం లేటుగా దొరుకుతాయి. ఇంకొన్ని సార్లు దోపిడీ దొంగలు ఎత్తుకెళ్లిపోయిన దాఖలాలు కూడా ఉంటాయి. కొంత మంది పశువులను ప్రాణంగా చూసుకుంటారు. మనుషులపై ఎలాంటి మమకారం ఉంటుందో.. అలాగే వాటిపై కూడా మమకారం పెంచుకుంటారు. ఒక్క క్షణం కనిపించకపోతే చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాగే అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఓ ఆవు కనిపించకపోయే సరికి అల్లాడిపోయాడు. అంతే 70 ఏళ్ల ఓ రైతు పోరాటానికి పూనుకున్నాడు. చివరికి ఏమైందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

2021 ఫిబ్రవరి 11న దులరామ్ దారా అనే రైతుకు చెందిన ఓ ఆవు కనిపించకుండాపోయింది. ఆయన రాజస్థాన్ లోని సర్దార్ సహర్‌లో నివసిస్తున్నారు. పోలీసులకు కంప్లైంట్ చేశాడు. సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు రాసి... ఎఫ్‌ఐఆర్ (FIR) ఫామ్ అతనికి ఇచ్చారు. దీంతో ఆవు దొరికేస్తుంది అనుకుని సంబరపడ్డాడు. కానీ పోలీసులు ఎంత వెతికినా ఆవు కనిపించలేదు. సరిగ్గా 10 నెలల తర్వాత అంటే 2021 డిసెంబర్ 8న ఎవరో దారాకి ఫోన్ చేసి... నీ ఆవు మార్కెట్‌లో ఉంది చూసుకో అని చెప్పాడు. దారాకు ఎక్కడలేని ఆనందం వచ్చేసింది. వేగంగా వెళ్లాడు. మార్కెట్‌లో ఏదో తింటూ కనిపించింది. చూడగానే అది తన ఆవు అని నిర్ధారించుకున్నాడు. ఇంటికి తీసుకెళ్లాడు. కానీ తర్వాత కొంతమంది గుంపుగా వచ్చి.. దారాను (owner) చితకబాది ఆవును తీసుకెళ్లిపోయారు.

దారా 2021 డిసెంబర్ 9న పోలీసులకు (rajasthan police) మళ్లీ ఫిర్యాదు చేశాడు. ఈసారి ఫిర్యాదు స్వీకరించలేదు. దీంతో ఎస్పీని కలిశాడు. ఎస్పీ ఆదేశంతో 2021 డిసెంబర్ 21న కేసు రాశారు. పోలీసులు సరిగా దర్యాప్తు చేయలేదు. దీంతో దర్యాప్తు ఆఫీసర్, పోలీస్ స్టేషన్‌ని కూడా మార్పించారు. వేరే పోలీస్ స్టేషన్‌లో కూడా న్యాయం జరగలేదు. దీంతో దారా.. జైపూర్ డీజీపీని కలిసి వివరించాడు. కేసును దుంగర్‌గర్ పోలీస్‌స్టేషన్‌కి బదిలీ చేశారు. అక్కడా న్యాయం జరగలేదు. ఇక 2022 నవంబర్ 30న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్.. సర్దార్ సహర్‌కి ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చారు. ఆ సమయంలో టెలిఫోన్ టవర్ ఎక్కిన దారా.. తన ఆవును తిరిగివ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో తారానగర్ డీఎస్పీ ఓంప్రకాష్ గొడారా.. ఆవును (cow) తిరిగిస్తామని హామీ ఇచ్చారు.

సర్దార్ సహర్‌లోని వెటర్నరీ డాక్టర్‌ని కలిసిన డీఎస్పీ (DSP).... దారా ఇంట్లో ఉన్న దూడకు డీఎన్ఏ (DNA) టెస్ట్ శాంపిల్స్ తీసుకునేలా చేశారు. దుండగులు తీసుకెళ్లిన ఆవుకి కూడా శాంపిల్స్ తీసుకున్నారు. 2023 జనవరి 3న హైదరబాద్‌లోని ల్యాబ్‌కి రెండు శాంపిల్సూ వెళ్లాయి. టెస్ట్ రిపోర్టులు ప్రకారం ఆ ఆవు.. ఆ ఆడ దూడకు తల్లి అని తేల్చారు. దీంతో దారాకు ఆవును అప్పగించారు. ఈ సందర్భంగా ఆ ఆవుకి సంబంధించిన మరో 2 దూడలను కూడా అధికారులు గుర్తించారు. ఆవు ఫ్యామిలీ ఒక్కటవ్వడంతో దారాతో పాటూ ఆయన భార్య, కూతురు సంతోషం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Bride: వరుడి మెడలో దండ వేయకుండా.. సడన్‌గా గదిలోకి వెళ్లిపోయిన వధువు.. పెళ్లికొడుకు ఫ్రెండ్స్ చేసిన నిర్వాకంతో..!

ఇది కూడా చదవండి: Viral Video: గత జన్మలో పాత పగలేమైనా ఈ గాడిదకు గుర్తొచ్చాయేమో.. స్కూటీపై వెళ్తున్న వాడిని అడ్డగించి మరీ..!

ఇది కూడా చదవండి: Viral News: అవును.. నిజమే.. గాజు సీసాలో ఉన్న ‘గుండె’ ఈ యువతిదే.. చాలా ఏళ్ల తర్వాత చూసి మురిసిపోయింది..!

Updated Date - 2023-05-23T18:05:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising