ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఇదేందయ్య ఇది.. రెస్టారెంట్‌కి వెళ్తే రుచికరమైన భోజనం కదా పెట్టాలి.. మరీ ఇలానా..!

ABN, First Publish Date - 2023-02-16T11:09:28+05:30

జపాన్‌లోని ఓ రెస్టారెంట్‌లో (Japan Restaurant) ఒక కస్టమర్‌కు వడ్డించిన స్పెషల్ డిష్ తాలూకు వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ (Viral Video) అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Viral Video: జపాన్‌లోని ఓ రెస్టారెంట్‌లో (Japan Restaurant) ఒక కస్టమర్‌కు వడ్డించిన స్పెషల్ డిష్ తాలూకు వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ (Viral Video) అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అసలు ఇలాంటి భోజనం పెట్టడం ఏంటి? అని కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉంది? కస్టమర్‌కు ఆ రెస్టారెంట్ వాళ్లు ఏం భోజనం వడ్డించారు? వీడియోలోని దృశ్యాల ఆధారంగా... ఓ కస్టమర్ ముందున్న భోజనం ప్లేట్‌లో ఒక స్పెషల్ డిష్ మనకు కనిపిస్తుంది. అందులో మూడు చేపలు, ఒక నిమ్మకాయ ముక్క, కొన్ని ఉల్లి ముక్కలు, ఇతర ఇంగ్రియంట్స్ ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఆ మూడు చేపల్లో ఒకటి బతికే ఉండడం అనేది అసలు ట్విస్ట్.

కస్టమర్ తనకిచ్చిన చాప్స్‌స్టిక్‌ను ఆ చేప నోటి దగ్గర పెట్టగానే అది దాన్ని కరిచిపట్టుకోవడం మనం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో 'Oddly Terrifying' అనే పేరుతో ఉన్న ట్విటర్ ఖాతా నుంచి పోస్ట్ అయింది. దీనికి ఆ ఖాతాదారుడు "రెస్టారెంట్‌లో వడ్డించిన చేప చాప్‌స్టిక్‌ను కొరుకుతుంది చూడండి" అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం ట్విటర్‌లో వైరల్ అవుతోంది (Video Goes Viral). ఇప్పటివరకు 4.2మిలియన్ల వ్యూస్, 83వేలకు పైగా లైక్స్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇకేందుకు ఆలస్యం మీరూ జపాన్ రెస్టారెంట్ వడ్డించిన స్పెషల్ చేప డిష్‌పై ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి: ఎన్నారైలకు ప్రయోజనం కలిగేలా బైడెన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై భారత చిన్నారులకు..

Updated Date - 2023-02-16T11:49:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising