ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Best Food Cities: ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ సిటీస్‌లో.. 5 భారతీయ నగరాలు ఇవే..

ABN, Publish Date - Dec 22 , 2023 | 05:46 PM

పర్యాటక ప్రాంతాలు, వివిధ రకాల ఆహార పదార్థాలు తదితరాల ఆధారంగా ఒక్కో ప్రంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇక ఫుడ్ విషయానికొస్తే ప్రపంచంలోని..

పర్యాటక ప్రాంతాలు, వివిధ రకాల ఆహార పదార్థాలు తదితరాల ఆధారంగా ఒక్కో ప్రంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇక ఫుడ్ విషయానికొస్తే ప్రపంచంలోని చాలా నగరాలు.. భోజన ప్రియులును తెగ ఆకట్టుకుంటుంటాయి. అయితే ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ నగరాల విషయంలో టేస్ట్ అట్లాస్ తాజాగా ఓ జాబితాను విడదల చేసింది. ఇందులో భారతీయ నగరాలు ఏయే స్థానాల్లో ఉన్నాయో తెలుసుకుందాం..

టేస్ట్ అట్లా్స్ (TasteAtlas) విడుదల చేసిన ఉత్తమ ఆహార పదార్థాలు దొరికే నగరాల్లో ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, లక్నో (Mumbai, Hyderabad, Delhi, Chennai, Lucknow) టాప్ 100లో చోటు దక్కించుకున్నాయి. ఇందులో టాప్ 50లో ముంబై (35), హైదరాబాద్ (39) నిలవగా.. ఢిల్లీ 56వ స్థానంలో, చెన్నై 65, లక్నో 92వ స్థానాల్లో నిలిచాయి. వీటిలో ఢిల్లీ, ముంబై నగరాలు చాట్‌లకు ప్రసిద్ధి చెందాయి. అలాగే హైదరాబాద్ బిర్యానీకి, చెన్నై దోస, ఇడ్లీకి, లక్కో మాత్రం కబాబ్స్, బిర్యానీకి ప్రసిద్ధి చెందింది.

ఇక ఈ జాబితాలో అగ్రస్థానంలో ఇటలీలోని రోమ్ నిలిచింది. తాజా, రుచికరమైన పదార్థాలు దొరికే నగరంగా గుర్తింపు పొందింది. అలాగే 2వ స్థానంలో ఇటలీలోని బోలోగ్నా నగరం, 3వ స్థానంలో నేపుల్స్ నగరాలు నిలిచాయి. ఈ మూడు ఇటాలియన్ నగరాలు పాస్తా, పిజ్జా, జున్ను ఆధారిత వంటకాలకు ప్రసిద్ధి చెందాయి.

ఇక టాప్ 10 నగరాల జాబితాలో వియన్నా (ఆస్ట్రియా), టోక్యో (జపాన్), ఒసాకా (జపాన్), హాంకాంగ్ (చైనా), టురిన్ (ఇటలీ), గాజియాంటెప్ (టర్కీ), బాండుంగ్ (ఇండోనేషియా) ఉన్నాయి. ఈ దేశాల్లో ప్రజలు పావ్ భాజీ, దోస, వడ పావ్, చోలే భాతురే, కబాబ్‌లు, నిహారీ, పానీ పూరీ, చోలే కుల్చే, బిర్యానీ తదితర వంటకాలను ఇష్టపడతారని సర్వేలే వెల్లడైంది.

Biotin: జుట్టుకు బలాన్ని చేకూర్చే పొడిని.. మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..

Updated Date - Dec 22 , 2023 | 06:58 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising