ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కడేమీ బ్రేక్ డ్యాన్సులు కూడా లేవు.. కానీ కరెన్సీ నోట్ల వర్షం కురిసింది.. కుప్పలుగా పడిన నోట్ల మధ్యలో..

ABN, First Publish Date - 2023-03-12T16:16:28+05:30

అర్ధనగ్న వేషధారణలో ఉన్న యువతులు డాన్సులు వేస్తుంటే.. యువకులు ఈలలు, కేకలు వేస్తూ రచ్చరచ్చ చేస్తారు. కొందరైతే ఓ అడుగు ముందుకేసి నోట్ల కట్టలను డాన్సర్లపై వెదజల్లుతుంటారు. ఎక్కడ డాన్స్ కార్యక్రమాలు జరిగినా ఇది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. కానీ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అర్ధనగ్న వేషధారణలో ఉన్న యువతులు డాన్సులు వేస్తుంటే.. యువకులు ఈలలు, కేకలు వేస్తూ రచ్చరచ్చ చేస్తారు. కొందరైతే ఓ అడుగు ముందుకేసి నోట్ల కట్టలను డాన్సర్లపై వెదజల్లుతుంటారు. ఎక్కడ డాన్స్ కార్యక్రమాలు జరిగినా ఇది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. కానీ ఎలాంటి యువతులు, బ్రేకు డాన్సులు లేకున్నా కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. అది కూడా ఎంతలా అంటే గుట్టలుగా పేరుకుపోయేంతలా నోట్లను వెదజల్లారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది, ఏ కార్యక్రమం సందర్భంగా ఇంతటి స్పందన లభించింది.. తదితర వివరాల్లోకి వెళితే..

గుజరాత్‌లోని (Gujarat) వల్సాద్ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ భజన కార్యక్రమంలో (Bhajan program) రాష్ట్రానికి చెందిన ప్రముఖ జానపద గాయకుడు కృతిదన్ గాధ్వి (Folk singer Kirtidan Gadhvi) పాడిన పాటకు ఇంతటి అపూర్వ స్పందన లభించింది. ‘‘వల్సాద్ అగ్నివీర్ గౌ సేవాదళ్’’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గో రక్షణ, గో సేవ కోసం ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహించారు. జానపద గాయకుడు గాధ్వి, గాయని వనిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ భజన కార్యక్రమానికి వందలాది మంది ప్రజలు హాజరయ్యారు. గాధ్వి హార్మోనియం పట్టుకుని పాట ఆలపించగానే.. ప్రజలంతా ఒక్కసారిగా చప్పట్లతో ప్రాంగణాన్ని మారుమోగించారు. అంతటితో ఆగకుండా పలువురు స్టేజి వద్దకు వచ్చి.. 10, 20, 100, 200, 500 రూపాయల నోట్లను వెదజల్లారు. చిన్న పిల్లలు సైతం అతడి పాటకు పరవశించిపోయారు.

Digital Payments in Wedding: పెళ్లి వేడుకలో QR Code బోర్డ్.. స్కాన్ చేసి ఓ బంధువు ఎంత పంపించాడో తెలిసి అవాక్కైన వధూవరులు..!

పాట పూర్తయ్యే వరకూ ఏకధాటిగా నోట్లను వెదజల్లుతూనే ఉన్నారు. చివరకు చూస్తే అక్కడ కరెన్సీ నోట్లు (currency notes) కుప్పలు కుప్పులుగా పడ్డాయి. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులను... అస్వస్థత కారణంగా కదలలేని స్థితిలో ఉన్న ఆవులను సంరక్షించే (Cow Protection) నిమిత్తం స్వచ్ఛంద సంస్థకు అందించనున్నట్లు గాయకుడు గాధ్వి తెలిపారు. గాధ్వి గత ప్రదర్శనలోనూ ఇలాగే నోట్ల వర్షం కురిసింది. స్వామి వివేకానంద నేత్రాలయం ట్రస్ట్ (Vivekananda Nethralaya Trust) ఆధ్వర్యంలో నూతన కంటి ఆస్పత్రికి నిధుల సేకరణ నిమిత్తం భజన కార్యక్రమం నిర్వహించారు. నవ్‌సారిలోని సుపా గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో కీర్తదాన్ గాధ్వి, గాయని ఊర్వశి రుద్దియా ఇచ్చిన ప్రదర్శనకు ఇలాగే నోట్ల వర్షం కురిసింది. కాగా, ప్రస్తుతం గాధ్వి ప్రదర్శనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Woman IAS Story: డబ్బులు లేకపోతే ఫ్రీగా దోశలు ఇచ్చిన హోటల్‌కే కలెక్టర్‌ అయ్యాక తిరిగొచ్చారు.. వార్త వైరల్‌ అవడంతో ఆమె రెస్పాన్స్ ఇదీ..!

Updated Date - 2023-03-12T16:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising