ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fraud Husband Video: మూడ్రోజుల పాటు హైదరాబాద్ వెళ్తున్నానన్న భర్త.. అనుమానంతో సీక్రెట్‌గా ఫాలో అయిన భార్య.. చివరకు అదిరిపోయిన ట్విస్ట్..!

ABN, First Publish Date - 2023-03-27T14:04:05+05:30

భర్త ఓ పెళ్లివేడుక దగ్గర ఆగడంతో తెలిసిన వారి పెళ్ళికాబోలు అందుకే వచ్చాడేమో అనుకుంది. కానీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భార్యా భర్తల బంధం చాలా అపురూపమైనది. కానీ కొందరు దాని విలువను చేతులారా పోగొడతారు. కొందరు భర్తలు భార్యల ముందు పైకి ఒకటి చెబితే వారు చేసేది మరొకటి. ఓ వ్యక్తి ఇలాగే చేశాడు. పనిమీద హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి ఇంటినుండి బయటపడ్డాడు. అతని మీద డౌటొచ్చిన అతని భార్య సీక్రెట్ గా అతన్ని ఫాలో అయింది. అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ భర్త చేసిన నిర్వాకం గురించి వివరంగా తెలుసుకుంటే..

భార్యలకు మాయమాటలు చెప్పి బయట ఎన్నో ఘనకార్యాలు చేస్తున్న భర్తలు చాలానే ఉన్నారు ఈ కాలంలో.. ఓ వ్యక్తి తన భార్యతో 'నాకు హైదరాబాద్ లో పని ఉంది, నేను హైదరాబాద్ కు వెళుతున్నాను, మూడురోజులు అక్కడే ఉంటాను' అని చెప్పాడు. తరువాత ఇంటి నుండి బయటకు జారుకున్నాడు. అతని ప్రవర్తనలో ఏదో తేడా కనిపించింది భార్యకు. అతను అబద్దం చెబుతున్నాడని భావించి కొడుకును తీసుకుని అతని వెనుకే సీక్రెచ్ గా ఫాలో అయింది. అతను ఓ పెళ్లివేడుక దగ్గర ఆగడంతో తెలిసిన వారి పెళ్ళికాబోలు అందుకే వచ్చాడేమో అనుకుంది. కానీ ఆ ఫంక్షన్ హాల్ బయట పెళ్ళికొడుకు ఫోటో చూసి విస్తుపోయింది. ఆ ఫోటోలో ఉన్నది ఆమె భర్తనే.

ఆమె కొడుకును తీసుకుని లోపలికి వెళ్ళి పెళ్ళికూతురు కుటుంబ సభ్యులతో 'ఇక్కడ పెళ్ళికొడుకు నా భర్త, ఇదిగో మా ఇద్దరికీ పుట్టిన పిల్లాడే ఈ బాబు' అని కొడుకును చూపించింది. వారంతా ఆమె అబద్దం చెబుతోందని అనుకున్నారు. కానీ ఆమె చాలా దృఢంగా చెబుతుండటంతో వారు ఆమెతో గదిలోకి వెళ్లి మాట్లాడుకుందామని చెప్పి తీసుకెళ్ళారు. గదిలో అంతా సమావేశమయ్యాక తన భర్త చేసిన ఘనకార్యాలు వివరించిందామె.. అతనితో ఆమెకు 2014 అక్టోబర్ 10వ తేదీన పెళ్ళి జరిగిందట, వారిద్దరకీ ఓ కొడుకు కూడా ఉన్నాడు. అంతేకాదు మొదట పెళ్లి చేసుకున్న 4ఏళ్ల తరువాత అతను తన భార్యకు చెప్పకుండా రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు భార్యలకు చెప్పకుండా మూడవ పెళ్ళి చేసుకోవడానికి సిద్దమయ్యాడు. ఈ విషయాలన్నీ ఆ మహిళ పెళ్లికూతురి కుటుంబానికి వివరించేసరికి వారంతా షాకయ్యారు. 'ముందు వెనుకలు తెలుసుకోకుండా మీరు మీ అమ్మాయిని ఇతనికిచ్చి పెళ్ళిచేయాలని ఎలా అనుకున్నారు' అంటూ ఆ మహిళ సదరు కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదంతా జరిగిన కొన్ని నిమిషాల తరువాత పెళ్ళికూతరు కుటుంబ సభ్యులు అందరూ కలసి మూడో పెళ్ళికి సిద్దమైన ఆ వ్యక్తిని బయటకు గెంటేశారు. ఆ మహిళ తన భర్త గురించి పెళ్ళికూతురి కుటుంబ సభ్యులకు వివరించడం, పెళ్లికూతరి కుటుంబ సభ్యులు ఆమె భర్తను బయటకు గెంటేయడం వీడియో తీశారు. Ghar Ke Kalesh అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. అతని చొక్కా గుండీలు ఊడిపోయి ఉండటం చూసి వారందరూ బాగా చితకబాదినట్టున్నారని అంటున్నారు నెటిజన్లు.

Read also: Viral Video: ఇలాంటి ప్రయోగం మీరెప్పుడూ చూసుండరు.. ఈ టీచర్ ఎంతబాగా చూపించారో చూడండి!


Updated Date - 2023-03-27T14:04:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising