ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: పెళ్లిలో వధూవరుల మధ్య ఆసక్తికర పోటీ.. చివరకు విపరీతమైన కోపంతో వధువు చేసిన పని...

ABN, Publish Date - Dec 23 , 2023 | 02:35 PM

పెళ్లిళ్లలో వధూవరుల మధ్య ఆసక్తికర పోటీలు జరుగుతుంటాయి. తలంబ్రాలు చల్లుకోవడం, బిందె నుంచి ఉంగరాలు బయటకు తీయడం, పూల బంతులను విసిరేసుకోవడం తదితర సమయాల్లో ఒకరికొకరు పోటీపడి మరీ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. అయితే...

పెళ్లిళ్లలో వధూవరుల మధ్య ఆసక్తికర పోటీలు జరుగుతుంటాయి. తలంబ్రాలు చల్లుకోవడం, బిందె నుంచి ఉంగరాలు బయటకు తీయడం, పూల బంతులను విసిరేసుకోవడం తదితర సమయాల్లో ఒకరికొకరు పోటీపడి మరీ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. అయితే ఇదంతా సరదా సరదాగానే సాగుతుంటుంది. అయితే అప్పుడప్పుడూ ఇలాంటి ఘటనలు సీరియస్ అవుతుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పెళ్లిలో వధూవరుల మధ్య వినూత్న ఫన్నీ గేమ్ పెడతారు. అయితే ఇది కాస్త వధువు ఆగ్రహానికి కారణమవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరుల (bride and groom) మధ్య ఓ సరదా పోటీ నెలకొంటుంది. వేదికపై ఉన్న వరుడు.. కింద ఉన్న వధువును పైకిలాగాలి. అలాగే వధువు కూడా పైకి రాకుండా వరుడినే కిందకు లాగాలి. ఈ పోటీలో (Funny competition) ఎవరు గెలుస్తారో చూడాలని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ముందుగా వరుడు వధువు చేయి పట్టుకుని పైకి లాగాలని ప్రయత్నిస్తాడు. అయితే వధువు పైకి రాకుండా వరుడినే కిందకు లాగుతుంది. దెబ్బకు వరుడు స్టేజి పైనుంచి కిందకు వెళ్లిపోతాడు.

Viral Video: దోచుకోవాలని వచ్చి.. క్షణాల్లో పారిపోయాడు.. కౌంటర్‌లో యువతి వద్ద అతడు చేసిన మిస్టేక్ ఏంటంటే..

అవమానంగా ఫీలైన వరుడు కాసేపటికి మళ్లీ వధువు చేయి పట్టుకుని గట్టిగా పైకి లాగబోతాడు. ఈ క్రమంలో వధువు కిందపడబోతుంది. దీంతో ఆమెకు కోపం కట్టలు తెంచుకుంటుంది. ‘‘నన్ను అంత గట్టిగా లాగుతావా.. పైకి వచ్చే ప్రసక్తే లేదు’’.. అని అనుకుంటూ వెనక్కు తిరిగి నిల్చుంటుంది. దీంతో బంధువులంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత వధువు వద్దకు వెళ్లి.. ‘‘ఇలాంటివన్నీ సరదా తీసుకోవాలి.. కోపం పెంచుకోకూడదు’’.. అని సర్దిచెబుతారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వధువుకు చాలా కోపం వచ్చినట్లుంది’’.. అంటూ కొందరు, ‘‘పెళ్లిలోనే వరుడికి చుక్కలు చూపించిందిగా’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ప్రీ వెడ్డింగ్ షూట్‌లో వరుడికి వధువు ముద్దు పెడుతుండగా షాకిచ్చిన పాము.. ఉన్నట్టుండి మధ్యలోకి దూసుకురావడంతో..

Updated Date - Dec 23 , 2023 | 02:36 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising