ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Photo: ఫన్నీగా ఉన్నా.. ఈ టూలెట్ బోర్డు వెనుక పెద్ద కథే ఉందిగా.. అద్దె ఇంటి కోసం వెతుకుతుంటే... త్వరపడండి మరి..

ABN, Publish Date - Dec 21 , 2023 | 09:23 PM

కొన్ని నగరాల్లో అద్దె ఇల్లు కావాలంటే కొన్నిసార్లు పెద్ద సాహసమే చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు రోజుల తరబడి వీధులన్నీ చుట్టేసినా మంచి ఇల్లు దొరకాలంటే చాలా కష్టమైపోతుంటుంది. ఒకవేళ దొరికినా తమ అభిరుచిగా ఉండకపోవడమే.. లేదా అద్దెలు మరీ ఎక్కువగా ...

కొన్ని నగరాల్లో అద్దె ఇల్లు కావాలంటే కొన్నిసార్లు పెద్ద సాహసమే చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు రోజుల తరబడి వీధులన్నీ చుట్టేసినా మంచి ఇల్లు దొరకాలంటే చాలా కష్టమైపోతుంటుంది. ఒకవేళ దొరికినా తమ అభిరుచిగా ఉండకపోవడమే.. లేదా అద్దెలు మరీ ఎక్కువగా ఉండడమో జరుగుతుంటుంది. ఇక బెంగళూరు వంటి మహా నగరాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అక్కడ అద్దె ఇళ్లకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఇంటి ముందు ఏర్పాటు చేసిన టూలెట్ బోర్డు చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఓ ఫొటో (Viral photo) తెగ వైరల్ అవుతోంది. బెంగళూరు (Bangalore) నగంరంలోని ఓ ఇంటి ముందు ఏర్పాటు చేసిన టూలెట్ బోర్డు చూసి అంతా నవ్వుకుంటున్నారు. బోర్డులో TO LET అని రాయాల్సింది పోయి.. TO - LATE అని రాశారు. అద్దె ఇంటి (Rental houses) కోసం వెతుకుతుంటే.. ఇప్పటికే మీరు చాలా ఆలస్యం అయ్యారు.. అని అర్థం వచ్చేలా ఈ రోడ్డును ఏర్పాటు చేశారు.

Personality Test: మీ చేతి బొటనవేలిని ఇలా పెడుతున్నారా.. అయితే మీరు ఎలాంటి వారో ఈజీగా తెలుసుకోవచ్చు..

పాదచారులు ఈ ఫొటోను చూసి.. నిజమే సమస్య ఇలాగే ఉంది.. అంటూ చర్చించుకుంటున్నారు. కొందరు ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బెంగళూరులో మంచి ఇల్లు దొరకాలంటే చాలా కష్టం’’, ‘‘సమస్యను చాలా చక్కగా వివరించారు’’, ‘‘అవును.. ఏ ఇల్లు అడిగినా.. ఇప్పటికే ఇచ్చేశాం అంటున్నారు’’, ‘‘బెంగళూరులో అద్దె ఇల్లు దొరకాలంటే పెద్ద యుద్ధమే చేయాలి’’, ‘‘ఈ ఫొటో చాలా ఫన్నీగా ఉంది’’.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.

Viral Video: పిజ్జా బదులు ఈ పరాటా ఎంతో మేలన్న ఆనంద్ మహీంద్రా.. ఇందుకు అభిషేక్ బచ్చన్ ఏమన్నారంటే..

Updated Date - Dec 21 , 2023 | 09:23 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising