Viral Video: వధువును నిండా ముంచిన వింత సాంప్రదాయం.. పెళ్లిపీటలపై ఉన్నట్టుండి ఓ వ్యక్తి చేసిన పని చూడండి..
ABN, First Publish Date - 2023-10-19T18:24:33+05:30
వివాహాలు చేసే విధానం ఒక్కోచోట ఒక్కోలా ఉంటుంది. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా అక్కడక్కడా వింత వింత ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. ఇలాంటి ఆచారాలు అక్కడి వారికి అలవాటైనా.. కొత్తవారు చూసినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. అలాగే ఇంకొన్ని..
వివాహాలు చేసే విధానం ఒక్కోచోట ఒక్కోలా ఉంటుంది. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా అక్కడక్కడా వింత వింత ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. ఇలాంటి ఆచారాలు అక్కడి వారికి అలవాటైనా.. కొత్తవారు చూసినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. అలాగే ఇంకొన్ని సాంప్రదాయాలు చూస్తే నవ్వు వస్తుంటుంది. తాజాగా, ఓ వివాహ కార్యక్రమంలో చోటుచేసుకున్న వింత ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెళ్లిపీటలపై వధూవరులు తలంబ్రాలు చల్లుకునే సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వధూవరుల మధ్యలోకి ఉన్నట్టుండి ఎంటరైన ఓ వ్యక్తి చివరకు చేసిన పని చూసి అంతా తెగ నవ్వుకున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వివాహ కార్యక్రమంలో వధూవరులు ఎదురెదురుగా కూర్చుని తలంబ్రాలు చల్లుకుంటుంటారు. అనంతరం వారి బంధువులంతా వరుసగా వచ్చి వధూవరులపై (bride and groom) అక్షింతలు చల్లి ఆశీర్వదిస్తారు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. మధ్యలో ఓ వ్యక్తి సడన్‌గా అక్కడికి ఎంటరవుతాడు. వచ్చినవాడు అక్షింతలు చల్లి వెళ్లిపోకుండా.. కింద కుండలో ఉన్న పాలను తీసుకుని (person pours milk on the head of bride and groom) వధూవరుల తలపై పోస్తాడు. వధువు తలపై పోసిన వెంటనే వరుడి తలపై కూడా పోస్తాడు. అయితే వరుడి తలపై టోపీ ఉండడంతో ఏమీ కాదు. అయితే ఈ ఊహించని ఘటలనతో వధూవరులు చిరాకుపడతారు. ఓ దశలో అతడి వైపు వరుడు మరింత చిరాకుగా చూస్తాడు.
వధువు తలపై మొత్తం రెండు సార్లు పాలు పోయడంతో మొత్తం తడిచిపోతుంది. ఛీ ఛీ మొత్తం తడిసిపోయాను.. అని అనుకుంటూ ఆమె కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతుంది. పక్కన ఉన్న మహిళలంతా అతన్ని మందలిస్తారు. దీంతో చివరకు నాలుక్కరుచుకున్న ఆ వ్యక్తి.. తప్పయిపోయింది అన్నట్లుగా తర్వాత వధూవరులసై అక్షింతలు చల్లి, అక్కడి నుంచి చల్లగా జారుకుంటాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదెక్కడి ఆచారంరా నాయనా’’.. అని కొందరు, ‘‘వధువుకు చాలా కోపం వచ్చినట్లుంది’’.. అని మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 50వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: బుల్లెట్ బైకుపై మహిళ భయంకర స్టంట్.. మగవారికి ఏమాత్రం తీసిపోని విధంగా ఒంటి చేత్తో..
Updated Date - 2023-10-19T18:26:45+05:30 IST