ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: మొసలి నోట్లో నుంచి ప్రాణాలతో బయటికొచ్చిన వ్యక్తి.. అయితే కాస్త తీక్షణంగా పరిశీలించగా..

ABN, Publish Date - Dec 22 , 2023 | 03:29 PM

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. అలాగే ఇంకొన్ని వీడియోలను చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొన్నేమో.. అందరినీ షాక్‌కి గురి చేస్తుంటాయి. తాజాగా...

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. అలాగే ఇంకొన్ని వీడియోలను చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొన్నేమో.. అందరినీ షాక్‌కి గురి చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పెద్ద మొసలి నోట్లో నుంచి ఓ వ్యక్తి ప్రాణాలతో బయటికి వచ్చాడు. ఇదెలా సాధ్యమైందని అనుమానం వచ్చిన వారు.. తీక్షణంగా పరిశీలించి, చివరకు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద మొసలిని (crocodile) ఓ వ్యక్తి తోక పట్టుకుని ఉంటాడు. మరో వ్యక్తి దాని తల వైపు నిలబడి ఎవరికో సాయం చేస్తున్నట్లు కనిపిస్తాడు. ఇంతలో మొసలి ఒక్కసారిగా తన నోటిని తెరుస్తుంది. దీంతో లోపలి నుంచి ఓ వ్యక్తి అతికష్టం మీద బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తాడు. బయట ఉన్న వ్యక్తి అతని చేయి పట్టుకుని గట్టిగా (man came out of the crocodile mouth) లాగడంతో ఎట్టకేలకు బయటికి వస్తాడు.

Viral Video: బంధువులతో సరదాగా మాట్లాడుతున్న వధూవరులు.. ఇంతలో ఉన్నట్టుండి వీరిపై విధి ఎలా పగబట్టిందంటే..

అయితే ఇంత జరుగుతున్నా మొసలి మాత్రం కిక్కురుమనకుండా ఉండడం చూసి అందరికీ అనుమానం వచ్చింది. కాస్త తీక్షణంగా చూడగా.. అది మొసలి బొమ్మ అని తెలిసింది. అచ్చం మొసలిని పోలి ఉండే ఈ రొబోట్‌తో వారు ఈ ఫన్నీ వీడియోకు ప్లాన్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది అచ్చం నిజమైన మొసలిలా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో! చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ప్రీ వెడ్డింగ్ షూట్‌లో వరుడికి వధువు ముద్దు పెడుతుండగా షాకిచ్చిన పాము.. ఉన్నట్టుండి మధ్యలోకి దూసుకురావడంతో..

Updated Date - Dec 22 , 2023 | 03:30 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising