ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gas: గ్యాస్ మంట తగ్గాలంటే ఇలా చేయండి..ఆ బాధ నుంచి ఉపశమనం పొందండి..!

ABN, First Publish Date - 2023-03-09T09:50:26+05:30

వంట గ్యాస్ (Gas) ధర(price) గుదిబండాల మన నెత్తిన దెబ్బ కొడుతున్న క్షణాలు ఇవి. ఒక్క మాటలో చెప్పాలంటే..ఇప్పుడు మీ ఇంట్లో గ్యాస్ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వంట గ్యాస్ (Gas) ధర(price) గుదిబండాల మన నెత్తిన దెబ్బ కొడుతున్న క్షణాలు ఇవి. ఒక్క మాటలో చెప్పాలంటే..ఇప్పుడు మీ ఇంట్లో గ్యాస్ ప్రమాదం అంచున భగభగ మండిపోతుంది. నాలుగేళ్లలో సిలిండర్ ధర మూడు రేట్లు పెరిగింది.రూ.495 ఉన్న గ్యాస్ ఇప్పుడు ఏకంగా రూ.1,165లకు చేరింది. అయితే.. దీన్ని ఒక కంట కనిపెట్టకపోతే మనము కాలిపోతాం. మంట కన్నా..ట్యాక్స్(TAX) ఎక్కువ వేడితో జనాన్ని కాల్చిపరేసిన వేళ..మనమే మన గ్యాస్ కాపాడుకోవాలి. లేకపోతే మనమే కాలిపోతాం. ఆ బాధ తప్పడానికి కొన్ని చిన్న చిట్కాలు చాలు. అయిన కాడికి గ్యాస్ ఆదా చేసుకోవడానికి గ్యాస్ ఎప్పుడు హై ప్లేమ్‎లో పెట్టకూడదు. మీడియం నుండి తక్కువ వేడి మీదం వంట చేయాలి. మంట పెద్దగా పెట్టి వంట చేస్తే.. గిన్నే చుట్టురా మంట పెంచి గ్యాస్ వృథాను పెంచుతుంది. గ్యాస్ ఆదా చేయడానికి ట్రిక్ ఉపయోగించండి.

అలాగే వంట చేస్తున్నప్పుడు మూత పెట్టి ఉడికించాలి. గ్యాస్ ను తక్కువ మంటపై ఉంచి మూత పెట్టి ఉడికించడం వల్ల.. స్ట్రీమింగ్ ద్వారా ఆహారం ఉడికిపోతుంది. అవసరమైతే ప్రెషర్ కుక్కర్(Pressure cooker) ఉపయోగించండి. ప్రెషర్ కుక్కర్‎లో వంట చేయడం వల్ల. వంట గ్యాస్‎ను సులభంగా ఆదా చేసుకోవచ్చు. బర్నర్‎ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. బర్నర్‎లో దూలి పేరుకుపోతే.. గ్యాస్ ఎక్కువగా వినియోగించబడుతుంది. గోరువెచ్చని నీటిలో ముంచిన గుడ్డతో బర్నర్‎ను శుభ్రం చేయండి. ప్రతి మూడు నెలలకు నిపుణిడితో శుభ్రం చేయించుకోండి. బర్నర్‎తో పాటు మీరు వండే గిన్నేలను కూడా చూసుకోండి. డిష్ దిగువన శుభ్రంగా ఎటువంటి మాడు లేకుండా చూసుకోండి. పాత్ర అడుగున మసి ఉంటే.. ఎక్కువ గ్యాస్ వృథా అవుతుంది. కాబట్టి శుభ్రమైన పాత్రల్లో ఉడికింంచాలి. అది త్వరగా వేడేక్కుతుంది. ఆహారాన్ని రిఫ్రిజ్ రేటర్ నుంచి బయటకు తీసిన తర్వాత నేరుగా గ్యాస్‎పై వేడి చేయవద్దు.

అలా చేస్తే.. ఆహారాన్ని వేడి చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువ గ్యాస్ వినియోగిస్తుంది. ఫ్రిజ్ నుంచి ఆహారం బయటకు తీసిన తర్వాత ముందుగా సాధారణ గది ఉష్ణోగ్రతకు(temperature) తీసుకురావాలి. అప్పుడు దాన్ని వేడి చేయండి. వంట చేసే ముందు గిన్నేలో వాటర్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే.. ఆ గిన్నేలో నీళ్లు ఆవిరై..గిన్నే వేడి ఎక్కాలంటే.. గ్యాస్ వృథా అవుతుంది. గిన్నేను కడిగి పొడిగా ఉండేట్లు చూసుకోవాలి. అప్పుడు గ్యాస్ మీద పెట్టాలి. వంటకు కావాల్సిన అన్ని పదార్థాలను సేకరించి వంటను ప్రారంభించిండి. కూరగాయాలు మొత్తం కట్ చేసుకుని రేడీ పెట్టుకోండి. కావాల్సిన మసాలలు కూడా అందుబాటులో ఉంచుకోండి. ఇవ్వన్నీ అప్పటికప్పుడే సిద్ధం చేస్తుంటే వంట చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. గ్యాస్ ఖర్చు పెరుగుతుంది. ఈ చిట్కాలతో వంట చేయడం వల్ల గ్యాస్ ఆదా అవుతుంది.

Updated Date - 2023-03-09T09:50:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising