ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: వామ్మో.. బైక్‌పై ఇద్దరమ్మాయిల రొమాన్స్.. బైక్ హ్యాండిల్ వదిలేసి మరీ లిప్‌లాక్.. వీడియో వైరల్!

ABN, First Publish Date - 2023-07-31T19:29:10+05:30

సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకునేందుకు యువతీయువకులు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. బైక్‌పై రొమాన్స్ చేస్తున్న యువ జంటలకు సంబంధించిన పలు వీడియోలు ఇటీవలి కాలంలో వైరల్‌గా మారాయి.

సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకునేందుకు యువతీయువకులు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. బైక్‌పై రొమాన్స్ (Bike romance videos) చేస్తున్న యువ జంటలకు సంబంధించిన పలు వీడియోలు ఇటీవలి కాలంలో వైరల్‌గా మారాయి. బైక్‌పై వెళుతూ రొమాన్స్ చేసుకుంటూ వీడియో తీసుకోవడం, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వ్యూస్ దక్కించుకోవడం అనేది ఓ ట్రెండ్‌గా మారింది. అయితే వీటిన్నింటినీ తలదన్నేలా తాజాగా ఇద్దరమ్మాయిలు బైక్‌పై రొమాన్స్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)అవుతోంది.

ghantaa అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో కదులుతున్న బైక్‌పై ఇద్దరమ్మాయిలు ఎదురెదురుగా కూర్చున్నారు (Two girls romance on bike). ఇద్దరూ కౌగలించుకున్నారు. లిప్‌లాక్ కూడా చేసుకున్నారు. అయితే ఆ క్రమంలో బైక్ నడుపుతున్న యువతి హ్యాండిల్ వదిలేసి ప్రమాదకర సాహసం చేయడం గమనార్హం. ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి ఆ యువతులు వీడియో కోసం ప్రమాదకర సాహసం చేశారు (Dangerous Stunt).

Kerala: పాపం.. ఫొటోలు తీసుకుందామని కొండ చివరకు వెళ్లిన కొత్త జంట.. రెప్ప పాటులో ఎంత ఘోరం జరిగిందంటే..

ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, బైక్ నెంబర్ ప్లేట్‌ను బట్టి ఆ వీడియోను తమిళనాడు (Tamilnadu)లో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 2 కోట్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. దాదాపు 80 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ యువతులను విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-31T19:29:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising