Shocking: మరో దారుణం.. 23 ఏళ్ల కుర్రాడు చనిపోతే.. బైక్ వెనుక మంచాన్ని కట్టి.. దానిపై మృతదేహాన్ని పడుకోబెట్టి..
ABN, First Publish Date - 2023-07-25T16:28:17+05:30
మారుమూల ప్రాంతాల్లో ప్రజల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కొన్ని ప్రాంతాల్లో అయితే కనీస సౌకర్యాలు కూడా లేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో వివిధ రకాల వ్యాధులతో ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా...
మారుమూల ప్రాంతాల్లో ప్రజల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కొన్ని ప్రాంతాల్లో అయితే కనీస సౌకర్యాలు కూడా లేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో వివిధ రకాల వ్యాధులతో ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా. మహారాష్ట్రలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో కన్నుమూసిన 23 ఏళ్ల కుర్రాడి మృతదేహాన్ని.. బైకుపై తీసుకెళ్లడంతో ప్రజలు మండిపడుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండడంతో నెటిజన్లు అయ్యో! పాపం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మహారాష్ట్ర (Maharashtra) గడ్చిరోలి జిల్లా భామ్రాగడ్ తాలూకా పరిధి దుర్గంకృష్ణార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా కొన్నినెలలుగా ప్రజలు క్షయ వ్యాధితో (Tuberculosis (TB) అవస్థలు పడుతున్నారు. ఇది మారుమూల ప్రాంతం కావడంతో వైద్యాధికారులు నిర్లక్ష్యంగా (Medical negligence) వ్యవహరిస్తున్నారు. గతంలో చాలా మంది క్షయ వ్యాధితో మృతిచెందారు. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ క్రమంలో ఇటీవల మరో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గణేష్ అనే 23ఏళ్ల యువకుడికి క్షయ వ్యాధి సోకింది. జూలై 17న పరిస్థితి విషమించడంతో అతన్ని చికిత్సం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అతను అక్కడ చికిత్స (young man Death) పొందుతూ జూలై 20న మరణించాడు.
కనీసం మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి కూడా అంబులెన్స్ అందుబాటులో లేదు. ఓ చేతిలో డబ్బులు లేకపోవడం, మరోవైపు అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో చేసేదేమీలేక చివరకు ద్విచక్రవాహనాకి మంచం కట్టి, దానిపై మృతదేహాన్ని ఉంచి తీసుకెళ్లారు. ఈ విషయం కాస్త ఉన్నతాధికారులకు తెలియడంతో తప్పు సరిదిద్దుకునే పనిలో పడ్డారు. అక్కడికి అంబులెన్స్ పంపించారు. అయితే అప్పటికే వారు మృతదేహాన్ని తీసుకుని ఇంటికి వెళ్లారు. క్షయ వ్యాధితో ఆరు నెలలగా అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. యువకుడి మృతి ఘటనపై గడ్చిరోలి జిల్లా వైద్యాధికారి డాక్టర్ దావల్ సాల్వే మాట్లాడుతూ.. యువకుడి మృతి గురించి తనకు సమచారం అందలేదని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని చెప్పారు. విచారణ అనంతరం కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2023-07-25T16:28:17+05:30 IST