Viral Dance Video: ఈ బామ్మకు 60 ఏళ్లా..? లేక 20 ఏళ్లా..? నడుము నొప్పులతో బాధపడుతూ ఉండాల్సిన వయసులో..!
ABN, First Publish Date - 2023-04-12T20:19:54+05:30
హర్యానా దేశీ బిట్స్ అయిన హర్యానవిపై (Haryanvi) ఓ బామ్మ చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Dadi Dance Video: హర్యానా దేశీ బిట్స్ అయిన హర్యానవిపై (Haryanvi) ఓ బామ్మ చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె చేసిన డ్యాన్స్ మూవ్స్‌కు అసలు ఆమె 60ఏళ్ల బామ్మనా? లేక 20 ఏళ్ల యువతినా? అని కొద్దిసేపు మన కళ్లను మనమే నమ్మలేము. వామ్మో.. దాదీ అలా కాలి బొటన వేళ్లను చేతితో పట్టుకుని బొంగరంలా గిరాగిరా తిరిగేస్తుంటే.. చూస్తూ ఉండిపోవాల్సిందంతే. 15 సెకండ్ల నిడివి గల ఈ వీడియోను గౌరంగ్ భార్ద్వా (@GaurangBhardwa1) అనే ట్విటర్ యూజర్ పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్‌కు "నగరంలో ఉండే 20 ఏళ్ల యువతి ఒళ్లు నొప్పుల గురించి కంప్లయింట్ చేస్తున్న ప్రస్తుత కాలంలో.. ఊరిలో ఉండే ఈ 60ఏళ్ల బామ్మ.." అనే క్యాప్షన్ ఇచ్చాడు.
ఇక వీడియోలో బామ్మ.. పంజాబీ స్టైల్లో (Punjabi Style) సల్వార్-కమీజ్ ధరించి, తలపై ఓ గుడ్డ చుట్టుకుని ఉండడం మనం చూడొచ్చు. హర్యానవి సాంగ్ ప్లే కావడమే లేట్.. నెలపై కూర్చొని బొంగరంలా గిరాగిరా తిరుగుతూ అక్కడ ఆమెను చూస్తున్న మహిళలు, పిల్లలను తన మూవ్స్‌తో నోటమాట రాకుండా చేసింది. చూట్టు నిల్చొని వారు చప్పట్లు కొడుతుంటే దాదీ (Grandmother) రెచ్చిపోయింది. రెండు చేతులతో తన కాలి బొటన వేళ్లను పట్టుకుని ఆగకుండా తొమ్మిది రౌండ్లపాటు బొంగరంలా గిరాగిరా తిరిగేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇప్పటివరకు 40వేల మంది వరకు వీక్షించారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో గమ్మతైన కామెంట్లు పెడుతున్నారు. "వావ్.. ఆమెను చూస్తుంటే 60ఏళ్ల కంటే ఎక్కువే ఉంటాయి" అని ఒకరు, "నిజంగా ఇది అద్భుతం" అని మరోకరు, "బామ్మ.. ఎనర్జీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే" అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇంకేందుకు ఆలస్యం డ్యాన్స్ ఫ్లోర్‌ను దద్దరిల్లేలా చేసిన దాదీ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
Viral Video: ఆమెతో మాట్లాడాలి.. ఎవరైనా వెళ్లి నాకు ఫోన్ చేయించండంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్.. ఇంతకీ ఈమె ఎవరంటే..!
Updated Date - 2023-04-12T20:19:54+05:30 IST