ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Marriage: అంబులెన్స్‌లో మండపానికి వచ్చి.. స్ట్రెచర్‌పై కూర్చునే వధువుకు తాళి కట్టిన వరుడు.. ఇలాంటి పెళ్లిని ఇప్పటిదాకా చూసుండరు..!

ABN, First Publish Date - 2023-06-30T15:55:36+05:30

వివాహ మంటపాల్లోకి వినూత్నంగా ఎంట్రీ ఇచ్చే వధూవరులను ఇటీవల చాలా మందిని చూస్తూనే ఉన్నాం. బైకులో మంటపానికి వచ్చి, వధువును తీసుకెళ్లిన వరుడిని చూశాం.. అలాగే ట్రాక్టర్‌పై మంటపానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరచిన వధువును కూడా చూశాం. ఇలాంటి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివాహ మంటపాల్లోకి వినూత్నంగా ఎంట్రీ ఇచ్చే వధూవరులను ఇటీవల చాలా మందిని చూస్తూనే ఉన్నాం. బైకులో మంటపానికి వచ్చి, వధువును తీసుకెళ్లిన వరుడిని చూశాం.. అలాగే ట్రాక్టర్‌పై మంటపానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరచిన వధువును కూడా చూశాం. ఇలాంటి వివాహాలకు సంబంధించిన వీడియోలు ఇటీవల తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం జరిగిన వివాహం ఇందుకు పూర్తి విరుద్ధం. వరుడు అంబులెన్స్‌లో మంటపానికి వచ్చి, స్ట్రెచర్‌‌పై కూర్చునే వధువుకు తాళి కట్టాడు. ఇలాంటి వివాహాన్ని ఇప్పటికాకా చూసి ఉండరు..

సోషల్ మీడియాలో వివాహానికి సంబంధించిన వార్త తెగ చక్కర్లు (Wedding viral news) కొడుతోంది. జార్ఖండ్ (Jharkhand) పాలములోని మేదినీనగర్‌ పరిధి షాపూర్‌లో ఉన్న కోయల్ రివర్ వ్యూ హోటల్‌లో ఓ అరుదైన వివాహం జరిగింది. గర్వా జిల్లాలోని కంది గ్రామానికి చెందిన చంద్రేష్ మిశ్రాకు.. పనేరి డ్యామ్ నివాసి ప్రేరణ మిశ్రాతో వివాహం (marriage) నిశ్చయమైంది. జూన్ 25న వివాహం జరగాల్సి ఉండగా.. కొన్ని రోజుల ముందు చంద్రేష్ రోడ్డు ప్రమాదంలో (road accident) తీవ్రంగా గాయపడ్డాడు. కాలికి ప్యాక్చర్ అవడంతో కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. అయితే అప్పటికే ఇరు కుటుంబాల వారు పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు.

Train Video: రద్దీ రైల్లో సీటు కోసం ప్రమాదకరంగా వేలాడుతూ ఇతను చేసిన ప్రయత్నం.. చివరకు ఫలించిందో లేదో మీరే చూడండి..

మరోవైపు వధువు కుటుంబ సభ్యులు.. కల్యాణ మంటపం కూడా బుక్ చేశారు. ఇందుకోసం వారు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అయినా వివాహాన్ని వాయిదా వేసేందుకు వధువు కుటుంబీకులు అంగీకరించారు. అయితే చంద్రేష్ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. నిర్ణయించిన ముహూర్తానికి వివాహం జరగాల్సిందేనని పట్టుబట్టడంతో ఏర్పాట్లు చేశారు. అన్నమాట ప్రకారమే వివాహం రోజు మంటపం వద్దకు అంబులెన్స్‌లో (Ambulance) చేరుకున్నాడు. అక్కడి నుంచి స్ట్రెచర్‌పై కూర్చుని లోపలికి వచ్చాడు. చివరకు అదే స్ట్రెచర్‌ పైనుంచే వధువుకు తాళి కట్టాడు. వరుడి మంచి మనసును చూసి అతిథులంతా అభినందనలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు వరుడిని ప్రశంసిస్తూ.. వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Bride Video: ఈ వధువును చూసి జాలి పడుతున్న నెటిజన్లు.. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? వరుడి నిర్వాకం చూస్తే..!

Updated Date - 2023-06-30T15:55:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising