ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: పెళ్లి రోజే వధువుకు షాకింగ్ సీన్... అనుమానం వచ్చి పరుగు పరుగున వెళ్లి క్యారవ్యాన్‌లోకి తొంగిచూడగా..

ABN, First Publish Date - 2023-10-08T18:44:11+05:30

ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకునే వారిని చూశాం. అదేవిధంగా కట్టుకున్న భార్యను వదిలేసి ప్రేమించిన అమ్మాయితో వెళ్లిపోయిన వారిని కూడా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకునే వారిని చూశాం. అదేవిధంగా కట్టుకున్న భార్యను వదిలేసి ప్రేమించిన అమ్మాయితో వెళ్లిపోయిన వారిని కూడా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, వివాహం జరుగుతున్న రోజే చోటు చేసుకున్న విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. పెళ్లి రోజే ఓ వధువుకు అనుమానం కలిగింది. దీంతో మంటపం నుంచి పరుగుపరుగున బయటకు వెళ్లింది. చివరకు క్యారవ్యాన్‌లో చూడగా షాకింగ్ దృశ్యం కనిపించింది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral videos) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ వేడుకకు (wedding ceremony) బంధువులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. వధువు (bride) సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై స్నేహితులతో పాటూ వివాహ వేదిక వద్దకు చేరుకుంది. అయినా వరుడు (groom) మాత్రం ఎంతకీ అక్కడికి రాలేదు. దీంతో బంధువులతో పాటూ వధువు కూడా వరుడి రాక కోసం ఎదురు చూస్తోంది. అయినా అతను ఎంతసేపటికీ రాకపోవడంతో వధువుకు అనుమానం కలిగింది. కాసేపటికి బయట క్యారవ్యాన్‌లో ఎవరో ఉన్నట్లు తెలియడంతో పరుగుపరుగున అక్కడికి చేరుకుంది. అయితే వ్యాన్ డోర్లు మూసి ఉండడంతో లోపల ఎవరు ఉన్నారో అర్థం కాలేదు.

Viral Video: ఇదేదో వింత జంతువు అనుకుంటే పొరపాటే.. వేలి సైజులో ఉన్న దీని గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

అద్దాల నుంచి తొంగిచూసినా లోపల ఎవరూ కనపడకపోయేసరికి.. డోర్లు తీయాలని చూసినా రాలేదు. దీంతో చివరకు వ్యాన్ వెనక్కు వెళ్లి చూడగా షాకింగ్ దృశ్యం కనిపించింది. క్యారవ్యాన్‌లో వరుడు మరో అమ్మాయితో అసభ్యకర రీతిలో ఉండడం చూసి దిగ్భ్రాంతికి గురైంది. మోసపోయానంటూ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. దీంతో బంధువులంతా ఆమె వద్దకు చేరుకుని ఓదార్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వాడితో పెళ్లి కాకపోవడమే మేలు’’.. అని కొందరు, ‘‘పెళ్లికి ముందే అతడి నిర్వాకం బయటపడడం మంచిదైంది’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోకు ఒకే రోజు 21మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

Indian Railway: రైల్లో సీట్లోంచి సడన్‌గా లేచిన 19 ఏళ్ల కుర్రాడు.. ఎదురుగా కూర్చున్న దంపతులనే చూస్తూ.. అందరూ చూస్తుండగానే..!

Updated Date - 2023-10-08T18:44:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising