ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: బంధువులతో సరదాగా మాట్లాడుతున్న వధూవరులు.. ఇంతలో ఉన్నట్టుండి వీరిపై విధి ఎలా పగబట్టిందంటే..

ABN, Publish Date - Dec 21 , 2023 | 09:30 PM

విధి ఎప్పుడు ఎవరిపై పగబడుతుందో ఎవరూ చెప్పలేరు. సంతోషంగా ఉన్న సమయంలో విషాదాన్ని నింపుతుంది.. బాధలో ఉన్న సమయంలో కొన్నిసార్లు సంతోషాన్ని పంచుతుంది. అంతా బాగుంది అనుకునే సమయంలో కొన్నిసార్లు ...

విధి ఎప్పుడు ఎవరిపై పగబడుతుందో ఎవరూ చెప్పలేరు. సంతోషంగా ఉన్న సమయంలో విషాదాన్ని నింపుతుంది.. బాధలో ఉన్న సమయంలో కొన్నిసార్లు సంతోషాన్ని పంచుతుంది. అంతా బాగుంది అనుకునే సమయంలో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ వివాహ కార్యక్రమంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వధూవరులు బంధువులతో సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘అయ్యో పాపం! విధి ఎంతలా పగపట్టింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌‌లో (Sialkot) జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు (bride and groom) దండలు మార్చుకున్న అనంతరం బంధువులతో సరాదాగా గడుపుతుంటారు. ఈ క్రమంలో ఇద్దరూ సోఫాలో కూర్చుని వారి బంధువులతో సంతోషంగా మాట్లాడుతుంటారు. వధూవరులకు రెండు వైపులా వారి బంధువులు కూర్చుని ఉంటారు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వధువు ఇటువైపు తిరిగి వేరే వారితో మాట్లాడుతుండగా.. వరుడు తల కిందికి పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు.

Viral Photo: ఫన్నీగా ఉన్నా.. ఈ టూలెట్ బోర్డు వెనుక పెద్ద కథే ఉందిగా.. అద్దె ఇంటి కోసం వెతుకుతుంటే... త్వరపడండి మరి..

అంతలోనే గుండెపోటు (heart attack) వచ్చి ఒక్కసారిగా ముందుకు కుప్పకూలిపోతాడు. కొద్దిసేపు ఎవరూ గమనించకుండా మాట్లాడుకుంటుంటారు. అయితే వరుడు అలాగే పడుకుని ఉండడం చూసి అనుమానం వచ్చి వధువు చేత్తో తట్టి పిలుస్తుంది. అయినా వరుడు స్పందించకపోవడంతో అందరికీ ఆందోళన మొదలువుతుంది. వెంటనే ‘‘ఏమైంది.. ఏమైంది’’.. అంటూ వరుడి చుట్టూ చేరతారు. అంతా కలిసి ఎంత పిలిచినా వరుడు మాత్రం నిర్జీవంగా పడిఉంటాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ‘‘అయ్యో! దేవుడు ఎంత అన్యాయం చేశాడు’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటే చాలా బాధగా ఉంది’’.. అంటూ మరికొందరు, ‘‘విధి చాలా విచిత్రమైంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: పిజ్జా బదులు ఈ పరాటా ఎంతో మేలన్న ఆనంద్ మహీంద్రా.. ఇందుకు అభిషేక్ బచ్చన్ ఏమన్నారంటే..

Updated Date - Dec 21 , 2023 | 09:31 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising