Viral Video: 'ఇలాంటి వారికి పెళ్లెందుకు'.. వరుడిని తిట్టిపోస్తున్న నెటిజన్లు..!
ABN, First Publish Date - 2023-06-06T13:37:49+05:30
అప్పుడే పెళ్లయి.. బయటకు వస్తున్న నూతన దంపతులకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.
Viral Video: అప్పుడే పెళ్లయి.. బయటకు వస్తున్న నూతన దంపతులకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అయితే, ఆ వీడియో అంతలా వైరల్ కావడానికి కారణం మాత్రం నూటికి నూరుపాళ్లు వరుడే. కానీ, అతడేదో సమ్‌థింగ్ స్పెషల్ పని చేశాడనుకుంటే పొరపాటే. పైగా అతడు చేసిన పనికిమాలిన పనికి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు కూడా. వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. పెళ్లయిన తర్వాత వధువరులిద్దరూ ఒకరిచేయి మరొకరు పట్టుకుని చర్చి నుంచి బయటకు రావడం వీడియోలో ఉంది. వధువు చేతిలో పూలబొకేతో నడుచుకుంటూ వస్తోంది. అదే.. వరుడు మాత్రం చేతిలో సెల్‌ఫోన్‌తో బిజీగా ఉన్నాడు. వధువు ఎంతో ఆనందంగా తన ఎదురవుతున్న బంధువులను పలకరిస్తుంటే.. వరుడు మాత్రం తనకు ఏమీ పట్టనట్టుగా మొబైల్లోనే బిజీ ఉండడం మనం వీడియోలో చూడొచ్చు.
అతడి చేయి ఆమె చేతిలో ఉంది కానీ.. ధ్యాస మాత్రం ఫోన్ మీదే. చివరికి బయటకు వచ్చి కారులో ఎక్కేవరకు కూడా మనోడు ఫోన్ నుంచి బయటకు రాలేదు. ఈ వీడియోకు "నా బాడీ నీతోనే. కానీ, నా మైండే ఔటాఫ్ టౌన్" అనే క్యాప్షన్‌తో పోస్ట్ అయింది. అంతే.. ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. 'ఇది ఎంతోకాలం నిలిచే వివాహం కాదు. నాకు తెలిసి అర్ధగంట బాగా ఎక్కువ. ఎందుకంటే మనోడికి వధువు కంటే కూడా ఫోనే ప్రీతిప్రాయం' అని, 'చాలా అంటే.. చాలా త్వరగా విడాకులు ఖాయం' అని కామెంట్ చేస్తున్నారు.
Viral Video: ఇది దైవ లీలేనా..? డాక్టర్లకే అంతుచిక్కని విచిత్రం.. మూడు రోజుల పాప ఎన్ని సిత్రాలు చేస్తోందో మీరే చూడండి..!
Updated Date - 2023-06-06T13:37:49+05:30 IST