ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Unique Divorce: పెళ్లయిందన్న ఆనందంలో ఉన్న వధువుకు.. భారీ షాకిచ్చిన వరుడు.. రెండు గంటలకే విడాకులిచ్చేశాడు..!

ABN, First Publish Date - 2023-07-15T16:55:06+05:30

జీవితాంతం భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కూతురికి వివాహం ఘనంగా చేశారు. అయితే వారి ఆనందం కొన్ని గంటల్లోనే ఆవిరవుందని ఎవరూ ఊహించలేదు. పెళ్లయిందన్న ఆనందంలో ఉన్న వధువుకు.. వరుడు భారీ షాకిచ్చాడు. వివాహానంతరం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవితాంతం భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కూతురికి వివాహం ఘనంగా చేశారు. అయితే వారి ఆనందం కొన్ని గంటల్లోనే ఆవిరవుందని ఎవరూ ఊహించలేదు. పెళ్లయిందన్న ఆనందంలో ఉన్న వధువుకు.. వరుడు భారీ షాకిచ్చాడు. వివాహానంతరం భోజనాల దగ్గర మొదలైన చిన్న గొడవ.. చివరకు చిలికి చిలికి గాలివానలా మారింది. ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఆగ్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఖార్ మంటోలా ప్రాంతానికి చెందిన యువతికి (young woman) ఇక్కడి ప్రాంతానికి చెందిన ఆసిఫ్‌తో నిశ్చయమైంది. గురువారం వివాహం (marriage) జరగాల్సి ఉండడంతో బుధవారం రాత్రి వరుడు తన కుటుంబ సభ్యులు, బంధువులతో వధువు గ్రామానికి చేరుకున్నాడు. వేకువజాము 4గంటలకు ఊరేగింపు నిర్వహించడంతో పాటు 6గంటలకు వివాహ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. అయితే వివాహానంతరం భోజనాల దగ్గర అసలు సమస్య వచ్చి పడింది. భోజనం సరిగా లేదంటూ పెళ్లికొడుకు, పెళ్లి కూతురు బంధువుల మధ్య గొడవ మొదలైంది.

Viral: ఇది నిజంగా అద్భుతమే.. ఆ ఊళ్లో అయిదేళ్లుగా ఇదే సీన్.. ఒక్కసారైనా ఈ వింతను చూద్దామని తరలి వస్తున్న జనం..!

ఈ గొడవ కాస్తా.. కాసేపటికి మరో మలుపు తీసుకుంది. తనకు లగ్జరీ కారు, మరింత బంగారు కావాలని వరుడు డిమాండ్ చేశాడు. దీంతో వధువు తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ‘‘ఇదేంటీ.. వివాహం ముందు అంగీకరించి, ఇప్పుడేమో అదనపు కట్నం అడగడం న్యాయమా’’.. అంటూ వేడుకున్నారు. తమ కూతురు జీవితాన్ని నాశనం చేయొద్దంటూ వేడుకున్నా పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు వినిపించుకోలేదు. ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో చివరకు పంచాయితీ పోలీస్ స్టేషన్‌కి చేరింది. చివరకు వరుడు విడాకులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాడు. కాగా, ఈ ఘటనపై వరుడితో పాటూ మొత్తం 7మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

Viral Video: ఉన్నట్టుండి పొలంలోకి పెద్ద పులి వచ్చినా.. ఉలుకూ పలుకూ లేదు.. పైగా ఏమాత్రం భయం లేకుండా..

Updated Date - 2023-07-15T16:55:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising