ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HCA Clarity: మేం ఆహ్వానించాం.. తారక్‌ అందుకే రాలేకపోయారు

ABN, First Publish Date - 2023-02-28T14:04:51+05:30

ఇటీవల అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ అవార్డుల కార్యక్రమంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం సత్తా చాటింది. నాలుగు విభాగాల్లో అవార్డులతోపాటు స్పాట్‌లైట్‌ అవార్డు కూడా అందుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇటీవల అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ (Hollywood critics association awards) అవార్డుల కార్యక్రమంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)చిత్రం సత్తా చాటింది. నాలుగు విభాగాల్లో అవార్డులతోపాటు స్పాట్‌లైట్‌ అవార్డు కూడా అందుకుంది. దర్శకుడు రాజమౌళి(Rajamouli), రామ్‌చరణ్‌, కీరవాణి, కె.కె.సెంథిల్‌ కుమార్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అవార్డులు అందుకున్నారు. అయితే ఎన్టీఆర్‌ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఆయన్ను పిలవలేదా? అంటూ నెటిజన్లు, అభిమానులు హెచ్‌సీఏ (HCA awards) సంస్థను ప్రశ్నిస్తూ కామెంట్లు చేశారు. తారక్‌ (Tarak) ఈ వేడుకకు ఎందుకు రాలేకపోయాడు వివరణ ఇస్తూ ఓ పోస్ట్‌ చేసింది హెచ్‌సీఏ సంస్థ. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR) సినిమాను అభిమానించే వాళ్లకి చిన్న విన్నపం. మేం ఈ అవార్డు వేడుకకు ఎన్టీఆర్‌ను కూడా ఆహ్వానించాం. ఆయన కొత్త సినిమా షూటింగ్‌ కారణంగా ఆయన రాలేకపోయారు. మేం త్వరలోనే ఆయనకు అవార్డును అందజేస్తాం. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’’ అని ట్వీట్‌ చేసింది. (Hca clarity on NTR’s absence at Awards)

‘ఆయన వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయాడు. ఇటీవల ఆయన సోదరుడు తారకరత్న మరణించాడు. ఆయన కుటుంబం అంతా శోక సంద్రంలో ఉంది. ప్రస్తుతం ఆయన ఎలాంటి షూటింగ్‌లో పాల్గొనడం లేదు’’ అని క్లారిటీ ఇచ్చారు. దానికి కూడా హెచ్‌సీఏ (Hca clarity) స్పందించింది. ‘‘కొత్త సినిమా షూటింగ్‌ కారణంగా రాలేకపోతున్నట్లు ఆయన మాతో చెప్పారు. ఆ తర్వాత వాళ్ల సోదరుడు మరణించడంతో ఆ సినిమా షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చారు’’ అని హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ పేర్కొంది. అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న ఈ చిత్రం ఆస్కార్‌ అవార్డుకు అడుగు దూరంలో ఉంది. భారతీయ సినిమా స్టామిననాను ప్రపంచానికి తెలియజేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు ఆస్కార్‌ రావాలి అని అభిమానులు, తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Updated Date - 2023-02-28T15:26:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!