ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకే ఇంట్లో 8 మృతదేహాలు.. భార్య విడాకులు ఇస్తోందన్న కోపంతో కుటుంబంలోని అందరినీ చంపి..

ABN, First Publish Date - 2023-01-07T20:36:50+05:30

ఆ దంపతులు.. ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులతో సంతోషంగా గడిపేవారు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ ఇటీవల దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలతో భార్య విసిగిపోయింది. చివరకు భర్తతో విడిపోవాలని నిర్ణయించుకుంది. భార్య తనకు విడాకులు ఇస్తోందని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ దంపతులు.. ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులతో సంతోషంగా గడిపేవారు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ ఇటీవల దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలతో భార్య విసిగిపోయింది. చివరకు భర్తతో విడిపోవాలని నిర్ణయించుకుంది. భార్య తనకు విడాకులు ఇస్తోందని తెలుసుకున్నభర్త కోపంతో ఊగిపోయాడు. చివరకు ఎనిమిది మంది కుటుంబ సభ్యులను కాల్పి చంపాడు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

తమ సంఘం నుంచి బయటికి వెళ్లడంతో.. 50 మంది మహిళలు కలిసి మూకుమ్మడిగా ఒకే వ్యక్తిపై..

అమెరికాలోని (America) ఉటా పరిధి ఐరన్ కౌంటీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన మైఖేల్‌కు.. భార్య తౌషా హైట్, ముగ్గురు కూతుళ్లు, ఇద్దకు కొడుకులు ఉన్నారు. ఇన్నాళ్లూ ఎలాంటి సమస్యలూ లేని వీరి కుటుంబంలో ఇటీవల ఊహించని సమస్యలు వచ్చిపడ్డాయి. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ దంపతుల (couple) మధ్య తరచూ గొడవలు (quarrels) జరుగుతుండేవి. దీంతో చివరకు మైఖేల్ భార్యకు చిరాకు పుట్టింది. భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో డిసెంబర్ 21న విడాకుల (Divorce) కోసం దరఖాస్తు చేసుకుంది.

బ్యాగులో లక్ష రూపాయల నోట్ల కట్టలు.. కానీ నడిరోడ్డుపై బ్లేడుతో కోసుకుని ఓ యువకుడు దారుణం.. చివరకు..

ఈ విషయం తెలిసినప్పటి నుంచి మైఖేల్‌కు భార్యపై మరింత కోపం పెరిగింది. చివరకు కుటుంబాన్ని మొత్తం చంపేయాలనే దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. గురువారం రాత్రి భార్యా, పిల్లలపై కాల్పులు (firing) జరిపాడు. ఈ ఘటనలో వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. అంతటితో ఆగకుండా తన అత్తను కూడా కాల్చి చంపేశాడు. తర్వాత తానూ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య (suicide) చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

Viral Video: ఇతడి తెలివిని చూసి ఆనంద్ మహీంద్రాయే అవాక్కయ్యారు.. రూపాయి ఖర్చు లేకుండా..

Updated Date - 2023-01-07T20:38:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising