ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Facts: డయాబెటిస్ ఉంది కదా అని చపాతీలను పక్కన పెట్టేస్తున్నారా..? గోధుమ పిండికి బదులుగా ఈ మూడింటినీ వాడితే..!

ABN, First Publish Date - 2023-11-04T10:19:28+05:30

చపాతీల వెనుక వాస్తవాన్ని డాక్టర్లు చెప్పేశారు. మధుమేహం ఉన్నవారు అన్నం , చపాతీలకు ప్రత్యామ్నాయంగా మూడు రకాల పిండులు వాడితే మ్యాజిక్కే..

ఒకప్పుడు డయాబెటిస్ ఉందంటే చాలు అన్నం వదిలేసి చపాతీలు తినేవారు. అధిక బరువు సమస్య ఉన్నా, మధుమేహం ఉన్నా, ఫిట్ గా ఉండాలన్నా అన్నానికి బదులుగా చపాతీలను తినేవారు. చపాతీలు ఎన్ని తిన్నా బరువు పెరగమని, షుగర్ ఉన్నవారికి ఏమీ కాదనే అపోహ కూడా చాలామందిలో ఉండేది. అయితే చపాతీల వెనుక వాస్తవాన్ని డాక్టర్లు చెప్పేశారు. మధుమేహం ఉన్నవారు కార్బోహైడ్రేట్లు తక్కువ తీసుకోవాలని, చపాతీలలో కార్భోహైడ్రేట్ల శాతం ఎక్కువగానే ఉంటుందని డాక్టర్లు అంటున్నారు. చపాతీలలో ఉండే గ్లూకోజ్ స్థాయి రక్తంలో చక్కెర శాతాన్ని మరింత పెంచుతుంది. అన్నం , చపాతీలకు ప్రత్యామ్నాయంగా మూడు రకాల పిండులున్నాయి(three magic flours for diabetes). ఇవి డయాబెటిస్ ఉన్నవారికి నిజంగా వరమే అని చెప్పవచ్చు. అవేంటో తెలుసుకుంటే..

రాగిపిండి.. (Finger millet flour)

రాగిపిండికి చాలా చరిత్ర ఉంది. కొన్నిప్రాంతాలలో రాగులను విరివిగా ఉపయోగిస్తారు. రాగులు ఎక్కువగా తీసుకునేవారి శరీరం ఉక్కులా ఉంటుంది. దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రాగులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. రాగులలో ఉండే అమైనో ఆమ్లాలు, పైబర్, ఇతర పోషకాలు శరీరానికి ఎంతో మంచివి. రాగిపిండితో రొట్టెలు, రాగి అంబలి, రాగి జావ, బియ్యానికి బదులుగా రాగులను నానబెట్టి రాగుల దోశలు, రాగి ఇడ్లీ ఇలా చాలా రకాలుగా తినవచ్చు.

Read Also: Water Drinking Rules: నిలబడి మంచినీళ్లను తాగకూడదా..? అసలు మంచినీళ్లను ఎలా తాగాలని ఆయుర్వేదంలో రాసి ఉందంటే..!



శనగపిండి.. (Gram flour)

శనగపిండి అంటే చాలామందికి జంతికలు, బజ్జీలు, వడలు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ శనగపిండిని కూడా గోధుమ పిండిలా ఉపయోగించవచ్చు. ఈ పిండిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాదు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా ఇది నియంత్రిస్తుంది. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. శనగపిండితో వివిధ రకాల వంటకాలను తయారుచేసుకుని వాడుతుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

అమరాంత్ పిండి.. ( Amaranth flour)

అమర్నాథ్ పిండి గురించి తెలిసిన వారు చాలా తక్కువ. ఇది ఆన్లైన్ లో దొరుకుతుంది. ఈ పిండితో చేసిన రొట్టెలు షుగర్ ఎక్కువగా ఉన్నవారికి చాలా మంచివి. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులోకి వస్తుంది. ఈ పిండిలో యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు.. ప్రోటీన్, విటమిన్లు, లిపిడ్లు వంటి అవసరమైన పోషకాలు సమృద్దిగా ఉన్నాయి. ఈ కారణంగా ఈ పిండి మధుమేహం ఉన్నవారికి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది.

Read Also: Health Secret: 100 ఏళ్ల పాటు హ్యాపీగా బతకాలనుందా..? అయితే ఈ 3 అలవాట్లను వెంటనే మానేయండి..!


Updated Date - 2023-11-04T10:19:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising