ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Tips: ఎక్కువ మొత్తం పాల ప్యాకెట్స్ తెచ్చి వాడుకునే అలవాటుందా? ఎవ్వరికీ తెలియని షాకింగ్ నిజాలివీ..

ABN, First Publish Date - 2023-07-23T21:27:09+05:30

ప్రతిరోజూ ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉపయోగించేవి పాలు. బాగా ఆకలి అయినప్పుడు ఆహారమేమి తినకపోయినా గ్లాసుడు పాలు తాగితే ఓ గంట వరకు ఆకలి అనే సమస్య తలెత్తదు. కానీ ప్యాకెట్ పాలు ఉపయోగించడంలో చాలామంది పొరపాట్లు చేస్తారు..

ప్రతిరోజూ ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉపయోగించేవి పాలు. బాగా ఆకలి అయినప్పుడు ఆహారమేమి తినకపోయినా గ్లాసుడు పాలు తాగితే ఓ గంట వరకు ఆకలి అనే సమస్య తలెత్తదు. అయితే ఇప్పటికాలం బిజీ జీవితాల్లో ప్రతి రోజూ పాలు తెచ్చుకుని వాడటం శ్రమగా భావిస్తారు. ఈ కారణంగా చాలామంది పాల ప్యాకెట్స్ ను ఒకేసారి ఎక్కువ మొత్తం తెచ్చి ఫ్రిజ్ లో నిల్వచేసుకుని వాడుతుంటారు. కేవలం ప్యాకెట్స్ మాత్రమే కాదు, విడిగా దొరికే పాలు కూడా కొందరు లీటర్ల కొద్ది ఫ్రిజ్ లో నిల్వ చేస్తుంటారు. కానీ ఇలా నిల్వచేసే పాల గురించి చాలా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. దీని గురించి తెలుసుకుంటే..

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం, దుకాణాలు ఏవీ దగ్గరగా లేకపోవడం వంటి కారణాల వల్ల చాలామంది పాల ప్యాకెట్స్(milk packets) ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటూ ఉంటారు. ఫ్రిజ్ లో పెట్టాం కాబట్టి ఓ వారం, పది రోజులు అయినా ఇవి బాగుంటాయని అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు. ప్యాక్ చేయబడిన పాలు 2-3రోజులు మాత్రమే బాగుంటాయి. అందుకే పాల ప్యాకెట్స్ మీద 'యూజ్ బై' అనే తేదీని కూడా పొందుపరిచి ఉంటారు. ఆ తేదీ దాటిన తరువాత పాలు నాణ్యత కోల్పోతాయి. ఆరోగ్యానికి హాని చేస్తాయి.

Viral Video: వామ్మో ఇతను మనిషా లేక మానవాతీత శక్తా.. నదిలో ఎదురుగా ప్రత్యక్షమైన మొసలి.. ఇతనేం చేశాడో చూస్తే..


ప్యాకెట్ పాలను మరొక రెండురోజులు వాడుకోవడానికి ఒక చిట్కా ఉంది. పాల ప్యాకెట్ ను డీప్ ఫ్రిజర్ లో పెట్టుకోవాలి. గడ్డకట్టిన పాలు సాధారణ పాలకంటే మరొక రెండురోజులు వాడుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే చాలామంది డీప్ ఫ్రిజ్ నుండి బయటకు తీసిన వాటిని వెంటనే వాడుకోవాలనే తొందరపాటులో వేడినీటిలో పెడుతుంటారు. గడ్డ కట్టిన పాలను ఇలా పెట్టకూడదు. దీని వల్ల పాలు పాయిజన్ కావడం, పగిలిపోవడం జరుగుతుంది. ఇలా గడ్డ కట్టిన పాలను 4-5రోజులు మాత్రమే వాడుకోవచ్చు.

సాధారణంగా పాశ్చరైజ్ చేసిన పాల జీవితకాలం కేవలం 2-3రోజులే. విడిగా పాలు కొనేవారు కూడా ఫ్రిజ్ లో పాలను ఎక్కువరోజులు నిల్వచేయకూడదు. మరీ ముఖ్యంగా చేపలు, మాంసాహరం వంటివి ఫ్రిజ్ లో ఉంచే సమయంలో పాలను ఫ్రిజ్ లో ఉంచకపోవడమే మంచిది. చేపలు, మాంసం ద్వారా పాలలో బ్యాక్టీరియా అభివృద్ది చెంది బ్యాక్టీరియల్ ఇన్పెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

Expiry Date: వామ్మో ఎక్స్పైరీ డేట్ గురించి షాకింగ్ నిజాలు.. షూస్ నుండి బాత్రూమ్ లో వాడే ఆ 4వస్తువుల వరకు.. ఏవేవి ఎన్ని రోజులు వాడొచ్చంటే..


Updated Date - 2023-07-23T21:27:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising