ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Tips: ఖర్జూరం, నెయ్యి.. ఈ సీక్రెట్ కాంబినేషన్ గురించి తెలుసా? ఆయుర్వేదం ఏం చెప్పిందంటే..!

ABN, Publish Date - Dec 14 , 2023 | 12:50 PM

ఖర్జూరాలను నెయ్యితో కలిపి తింటే కలిగే లాభాలేంటో ఆయుర్వేదం బయటపెట్టింది.

భారతదేశ ప్రాచీన వైద్యం ఆయుర్వేదమే. ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహారాలు చాలా శక్తివంతమైనవి. వాటిలో నెయ్యి, ఖర్జూరం ముఖ్యమైనవి. వీటిలో విటమిన్లు, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తాయి. అయితే ఈ రెండింటిని కలిపి తినడమనే రహస్య చిట్కాను ఆయుర్వేదం బయట పెట్టింది. ఖర్జూరాలను నెయ్యితో కలిపి తింటే ఏమవుతుందో.. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో.. దీన్నెలా తినాలో తెలుసుకుంటే..

రోగనిరోధక శక్తి(Immunity Power)

నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు రోగనిరోధక శక్తికి పవర్ హౌస్ లాంటివి. ఖర్జూరాలలో విటమిన్-ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నెయ్యిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, మంచి కొవ్వులు, బ్యూట్రిక్ యాసిడ్ ఉంటాయి. ఖర్జూరం, నెయ్యి రెండూ కలిసి అద్బుతమైన రోగనిరోధక శక్తిని చేకూర్చుతాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు సహకరిస్తాయి.

జీర్ణక్రియ(digestive agent)

ఖర్జూరాలలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగగా ఉంచుతుంది. నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ ప్రేగు ఆరోగ్యాన్ని, జీర్ణాశయంలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. నెయ్యి, ఖర్జూరం రెండూ తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం, కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గుతాయి.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే లెమన్ టీ తాగితే ఎన్ని లాభాలో..!!


గుండె ఆరోగ్యం(heart health)

ఖర్జూరంలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ నియంత్రణకు సహాయపడతాయి. నెయ్యి, ఖర్డూరం కలిపి తింటే గుండె ఆరోగ్యం బలపడుతుంది.

హార్మోన్ల అసమతుల్యత(hormones imbalance)

ఖర్జూరంలో ఉండే అధిక ఖనిజాలు, విటమిన్లు హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. నెయ్యి హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. నెయ్యి, ఖర్జూరం కలిపి తింటే నెలసరి సమస్యలు, మెనోపాజ్ సమయంలో ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయి. పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను సమతుల్యంగా ఉండేలా చేస్తుంది.

సహజ శక్తి(Natural power)

ఖర్జూరం సహజ శక్తిని ఇస్తుంది. నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ ఎక్కవసేపు శక్తిని నిలిపి ఉంచుతుంది. నెయ్యి, ఖర్జూరం రెండూ కలిపి తీసుకుంటే శారీర ధృడత్వం పెరుగుతుంది.

నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరం ఎలా తీసుకోవాలంటే..

10 నుండి 12 విత్తనాలు లేని ఖర్జూరాలు, 2 స్పూన్ల నెయ్యి తీసుకోవాలి. ఖర్జూరాలను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి.

ఒక పాన్ లో నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక అందులో ఖర్జూరాలు వెయ్యాలి. సన్నని మంట మీద 2-3 నిమిషాలు వేయించాలి. చల్లారిన తరువాత నెయ్యితో సహా ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. రోజూ ఒకటి లేదా రెండు తింటే అమితమైన శక్తి లభిస్తుంది. పై ప్రయోజనాలు అందుతాయి.

(గమనిక: ఇది ఆహార నిపుణులు, ఆయుర్వేద వైద్యులు పలు వేదికలలో పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

ఇది కూడా చదవండి: పిల్లలు సంతోషంగా ఉండాలంటే తల్లిదండ్రులు తప్పక చెయ్యాల్సిన పనులివీ..!

Updated Date - Dec 14 , 2023 | 01:12 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising