Health Tips: అన్నం తిన్నాక.. తినకముందు.. అసలు ఏఏ ఆహార పదార్థాలను అస్సలు తినకూడదంటే..!
ABN, First Publish Date - 2023-08-24T17:03:53+05:30
అన్నం తినకుంటే చాలామందికి తిన్నట్టు అనిపించదు. ఈ కారణంగా రోజులో ఒక్కపూట అయినా కచ్చితంగా అన్నం తింటుంటారు. అయితే అన్నం తినేముందు, తిన్న తరువాత పొరపాటున కూడా ఈ ఆహారాలు తినడం అలవాటు చేసుకోకూడదు
అన్నం భారతీయుల ఆహారంలో ప్రధానమైనది. ఏ ప్రాంతంలో అయినా సాంప్రదాయ వంటకాలలో బియ్యానికి తప్పనిసరి స్థానం ఉంటుంది. ఇక దక్షిణ భారతదేశంలో అన్నం తప్పనిసరిగా భోజనంలో ఉండాల్సిందే. సాధారణ భోజనం , బిర్యానీ, పులిహోర, దద్దోజనం, పాయసం, పరమాన్నం ఒకటనేమిటి అన్నంతో తయారుచేసే వంటకాలు బోలెడు. అన్నం తినకుంటే చాలామందికి తిన్నట్టు అనిపించదు. ఈ కారణంగా రోజులో ఒక్కపూట అయినా కచ్చితంగా అన్నం తింటుంటారు. అయితే అన్నం తినడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అన్నం తినేముందు, తిన్న తరువాత తినకూడని పదార్థాలేమిటి? తెలుసుకుంటే అధికబరువు, ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
జాగ్రత్తలు..
చాలామంది పనులు, ఉద్యోగాల కారణంగా అన్నాన్ని గబాగబా తినేస్తుంటారు(fast eating). కానీ ఇది చాలా తప్పు. అన్నం తినేటప్పుడు బాగా నమిలి తినాలి. ఈ టిప్ ఫాలో అయ్యేవారికి అధికబరువు అనే సమస్యే ఉండదు. జీర్ణక్రియలో కూడా ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వదు. కడపు, పేగుల పనిభారాన్ని ఈ టిప్ తగ్గిస్తుంది. జీర్ణ ఎంజైమ్ లు సమర్థవంతంగా విడుదల కావడానికి ఇది సహాయపడుతుంది. చేత్తో అన్నం కలిపేటప్పుడు కూడా బాగా కలపుకుని తినాలని అంటున్నారు. ఇలా చేత్తో బాగా కలపడం, మెల్లిగా నమిలి తినడం అనేది మైండ్ ఫుల్ ఈటింగ్ గా పిలవబడుతుంది. ఇది అలవాటు అయితే ఆహారం తినేటప్పుడు మెదడుకు, చేతివేళ్ళకు మధ్య చర్య సమర్థవంతంగా జురుగుతుందని, అధికంగా తినడం నివారించచ్చని ఆయుర్వేదం చెబుతోంది. భోజనం చేసేటప్పుడు అన్నం పరిమాణం తక్కువ, కూరల పరిమాణం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.
Viral Video: రోడ్డు పక్కన టిఫిన్ బండి పెట్టుకున్న ఈ వ్యక్తి.. ఇంగ్లీషులో ఇంత చక్కగా మాట్లాడుతున్నాడేంటా అని ఆరా తీస్తే..!
అన్నం తినేముందు తినకూడనివి..(foods avoid before rice eating)
అన్నం తినేముందు కొవ్వు (fat foods)ఎక్కువగా ఉన్న ఆహారాలు అస్సలు తినకూడదు. ఇది జీర్ణాశయాన్ని ఇబ్బంది పెడుతుంది. అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అన్నం తినడానికి ముందు కొవ్వు ఎక్కువ ఉన్న ఆహారాలు తింటే అన్నం జీర్ణం కావడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్, కడుపులో వికారం వంటి సమస్యలు ఏర్పడతాయి. అలాగే బాగా స్పైసీగా ఉన్న ఆహారం(spicy foods) కూడా అన్నం తినేముందు తినకూడదు. ఇది గుండెల్లో మంట, యాసిడ్ ఉత్పత్తి, కడుపు నొప్పి మొదలైన సమస్యలకు కారణమవుతుంది. చాలామంది ఆరోగ్యం అనే పేరుతో పచ్చి కూరగాయలు తింటుంటారు(raw foods). క్యారెట్, కీర దోస, క్యాబేజీ, వెజిటబుల్ సలాడ్, మొలకలు మొదలైనవి ఈ కోవలోకే వస్తాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివి అన్నం తినడానికి ముందు తింటే అది కడుపులో గ్యాస్ ఏర్పడటానికి కారణం అవుతుంది. పైపెచ్చు పైబర్ జీర్ణం అవడం కష్టం.
అన్నం తిన్న తరువాత తినకూడనివి..(foods avoid after rice eating)
అన్నం తిన్న తరువాత కొందరు పాలు తాగుతుంటారు. మరికొందరు భోజనం తరువాత ఐస్ క్రీమ్ తింటే బాగుంటుందని ఐస్ క్రీమ్ తింటుంటారు. అయితే పాలు, పాల ఉత్పత్తులు(milk, milk products) ఏవీ అన్నం తరువాత తీసుకోకూడదు. ఇది బరువు పెరగడానికి తోడ్పడటమే కాకుండా అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు కూడా కారణం అవుతుంది. మాంసంలో ప్రోటీన్ ఫుడ్(protine) అధికంగా ఉంటుంది. అన్నం తిన్న తరువాత మాంసాన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. దీనికారణంగా మలబద్దకం, అజీర్ణం చాలా సులువుగా వస్తాయి. రెస్టారెంట్ల దగ్గర నుండి పెళ్ళి విందు వరకు అన్నిచోట్లా భోజనం తరువాత స్వీట్(sweets) ఇస్తుంటారు. అయితే అన్నం తిన్న తరువాత స్వీట్ తినడం అధికబరువుకు మూలకారణం. ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు కానీ తరచుగా అన్నం తరువాత స్వీట్ తినడం ఫాలో అయితే అది మధుమేహ సమస్యకు దారితీస్తుంది.
Hair Care Tips: జుట్టు నల్లగా మారిపోవాలా..? తలస్నానం చేసేటప్పుడు షాంపూ బదులుగా వీటిని వాడితే..!
Updated Date - 2023-08-24T17:03:53+05:30 IST