Health Tips: అమ్మ బాబోయ్.. ఇన్ని అనారోగ్య సమస్యలు వస్తాయా..? ఈ 4 కూరగాయలను పచ్చిగానే తింటే..!
ABN, First Publish Date - 2023-09-27T11:44:49+05:30
ఈమధ్య కాలంలో ఆరోగ్యం మీద స్పృహ పెరిగిన చాలామంది వెజిటబుల్ సలాడ్ పేరుతో పచ్చి కూరగాయలు తింటున్నారు. కానీ ఈ నాలుగు రకాల కూరగాయలు మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ పచ్చిగా అస్సలు తినకూడదు.
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ప్రతి రోజూ తినే ఆహారంలో కూరగాయలు అధికంగా , అన్నం తక్కువగా ఉండాలని చెబుతుంటారు. కూరగాయలతో వివధ రకాల కూరలు వండుతుంటారు. అయితే ఈమధ్య కాలంలో ఆరోగ్యం మీద స్పృహ పెరిగిన చాలామంది వెజిటబుల్ సలాడ్ పేరుతో పచ్చి కూరగాయలు తింటున్నారు. కానీ ఈ నాలుగు రకాల కూరగాయలు మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ పచ్చిగా అస్సలు తినకూడదు. పచ్చిగా ఉన్నప్పుడు వీటిలో ఇ.కోలి, సాల్మోనెల్లా, టేప్ వార్మ్ గుడ్లు, పరాన్నజీవులు ఉంటాయి. ఒకవేళ వీటిని పచ్చిగా తింటే ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియా ప్రేగులు, రక్త ప్రసరణ ద్వారా మెదడులోకి ప్రవేశించి సిస్టిసెర్కోసిస్, మూర్చ, తలనొప్పి, లివర్ డ్యామేజ, కండరాలు దెబ్బతినడం వంటి తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతాయి. ఆ నాలుగు కూరగాయలు ఏంటో తెలుసుకుంటే..
క్యాలీఫ్లవర్.. (cauliflower)
ప్రపంచ వ్యాప్తంగా విరివిగా ఉపయోగించే కూరగాయలలో కాలీప్లవర్ ఒకటి. ఎంత తాజాగా ఉన్నా సరే క్యాలీ ఫ్లవర్ ను పచ్చిగా అస్సలు తినకూడదు. ఇందులో కంటికి కనిపించని టేప్ వార్మ్ లు ఉంటాయి. క్యాలీఫ్లవర్ ను వండే ముందు నీటిలో ఉడికించడం, లేదా వేడినీటిలో కొద్దిసేపు ఉంచడం తప్పనిసరి. క్యాలీఫ్లవర్ లో గోయిట్రోజెన్ లు ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథిని ప్రభావితం చేస్తాయి. థైరాయిడ్ రోగులు క్యాలీఫ్లవర్ కు దూరంగా ఉండాలి.
Banks: ఎస్బీఐ సహా 3 బ్యాంకులకు భారీ షాకిచ్చిన ఆర్బీఐ.. ఏకంగా రూ.3 కోట్ల జరిమానా.. అసలేం జరిగిందంటే..!
అరబికా ఆకులు.. (Arabica leaves)
కాఫీ మొక్క ఆకులను అరబికా ఆకులు అంటారు. వీటిని చాలా చోట్ల ఆహారంలో భాగంగా ఉపయోగిస్తారు. ఈ ఆకులను పొరపాటున కూడా పచ్చిగా అస్సలు తినకూడదు. సలాడ్ లలోనూ ఇతర మార్గాలలో వీటిని తినేముందు నీటిలో ఉడకబెట్టడం లేదా, వేడి నీటిలో కొద్దిసేపు ఉంచడం మంచిది. ఈ ఆకులలో ఆక్సలేట్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గొంతును చికాకు పెట్టడంతో పాటు చాలా హానికరమైన ప్రమాదాలు కలిగిస్తుంది.
క్యాప్సికమ్..(capsicum)
క్యాప్సికమ్ సలాడ్లు, శాండ్విచ్ లలో విరివిగా ఉపయోగిస్తారు. అయితే క్యాప్సికమ్ ను పచ్చిగా తినకూడదని అంటున్నారు. సలాడ్లు, శాండ్విచ్ లలో ఉపయోగించే ముందు క్యాప్సికమ్ ను ఎంత కడిగినా వాటిలో టేప్ వార్మ్ లు ఉంటాయి. వీటికారణంగా ఆరోగ్యానికి ప్రమాదం కలుగుతుంది.
వంకాయ.. (brinjal)
సాధారణంగా వంకాయను కూరగా వండుకుని తింటారు. కానీ కొందరు వీటిని కూడా వదలకుండా పోషకాలు, ఆరోగ్యం అంటూ పచ్చిగా తింటారు. వంకాయలో కూడా టేప్ వార్మ్ లు ఆల్కలాయిడ్స్ కూడా ఉంటాయి. ఇవి జీర్ణసమస్యలు, కీళ్ళ నొప్పులను కలిగిస్తుంది.
Health Tips: టమోటాలను తింటే వచ్చే లాభాలేంటి..? గర్భంతో ఉన్న వాళ్లు అసలు టమోటాలను తినొచ్చా లేదా అంటే..!
Updated Date - 2023-09-27T11:44:49+05:30 IST