Health Tips: ఆయిల్ ఫుడ్స్ తిన్నా సరే కొవ్వు అస్సలు పెరగకూడదంటే ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే..!
ABN, First Publish Date - 2023-11-30T12:23:14+05:30
ఆయిల్ ఫుడ్స్ తిన్నా సరే ఈ టిప్స్ ఫాలో అయితే శరీరంలో కొవ్వు పేరుకోవడం జరగదు..
ఆయిల్ ఫుడ్స్ అంటే ఇష్టపడనివారు ఉండరు. నూనెలో వేగిన ఆహారాలు చాలా రుచిగా ఉండటమే దీనికి కారణం. ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ పకోడా, పకోడీలు, ఆలూ చిప్స్ వంటి ఆహారాలు నూనెలో బాగా వేగుతాయి కాబట్టి వాటిని వదలకుండా తింటారు. కానీ ఆయిల్ ఫుడ్ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దీని కారణంగా అధికబరువు, మధుమేహం, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే తినాలనే కోరిక ఉన్నా చాలామంది ఆయిల్ ఫుడ్స్ ను బలవంతంగా దూరం పెడతారు. అయితే ఆయిల్ ఫుడ్ తిన్నా సరే.. కొవ్వు పెరగకూడదన్నా, శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ కింది టిప్స్ పాటిస్తే చాలు.
వేడినీరు..
ఆయిల్ ఫుడ్స్ లేదా డీప్ ఫ్రై ఫుడ్స్ తిన్న తరువాత ఒక గ్లాసు వేడినీరు తాగాలి. దీని వల్ల శరీరం నుండి విషపదార్థాలు తొలగిపోతాయి. ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతుంటే ఆయిల్ ఫుడ్స్ ప్రభావం శరీరం మీద ఉండదు.
డిటాక్స్ డ్రింక్స్..
డీప్ ఫ్రై ఆహారాలు తిన్న తరువాత వెజిటబుల్ సూప్, గ్రీన్ టీ, ఆరెంజ్ జ్యూస్, నిమ్మరసం, దోసకాయ, పుదీనా వంటి డిటాక్స్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో విషపదార్థాలు బయటకు వెళ్లడంలో సహాయపడతాయి. ఆయిల్ ఫుడ్ వల్ల శరీరంలో అసౌకర్యం ఉన్నవారు ప్రతిరోజూ డిటాక్స్ డ్రింక్ తాగుతంటే తొందర్లోనే ఫలితాలు చూస్తారు.
ఇది కూడా చదవండి: అల్లం ఎక్కువగా వాడుతున్నారా? ఈ నిజాలు తెలిస్తే..
నడక..
ఆహారం తిన్న తరువాత నడక వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగని ఎక్కువసేపు నడవక్కర్లేదు. తిన్న తరువాత రెండు వందల అడుగులు నడిస్తే సరిపోతుంది. ఇక ఆయిల్ ఫుడ్స్ తిన్న తరువాత అయితే కనీసం 15 నుండి 20 నిమిషాల నడవాలి.
ప్రోబయోటిక్స్..
ప్రోబయోటిక్స్ ఆహారాలు జీర్ణాశయాన్ని మెరుగ్గా ఉంచుతాయి. ఆయిల్ ఫుడ్స్ తిన్న తరువాత ప్రోబయోటిక్స్ తీసుకోవాలి.పెరుగు దీనికి చక్కని ఎంపిక.
సోపు నీరు..
సొంపు లేదా సోపు రెస్టారెంట్లలో భోజనం తరువాత ఇస్తుంటారు. ఇవి జీర్ణశక్తిని పెంచి కడుపు ఉబ్బరాన్ని, కడుపులో అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. సోపు గింజలను లీటరు నీటిలో వేసి బాగా ఉడికించాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నీటిని తాగితే ఆయిల్ ఫుడ్ కారణంగా శరీరంలో చేరిన కొవ్వు కరిగిపోతుంది. శరీరంలో విషపదార్థాలు బయటకెళ్లిపోతాయి.
గ్రీన్ టీ..
ఆయిల్ ఫుడ్ తిన్నతరువాత దాని ప్రభావం శరీరం మీద ఉండకూడదంటే గ్రీన్ టీ ది బెస్ట్.
(గమనిక: ఈ సమాచారం పలుచోట్ల ఆహార నిపుణులు, వైద్యులు పేర్కొన్న విషయాల ఆధారంగా రూపొందించబడింది. ఆరోగ్యం గురించి ఏమాత్రం సందేహాలున్నా వైద్యులను కలవడం మంచిది.)
ఇది కూడా చదవండి: చలికాలంలో వచ్చే సమస్య ఇదే.. కాళ్లకు ఇలా పగుళ్లు వస్తే..!
Updated Date - 2023-11-30T12:23:16+05:30 IST