Health Tips: తెలియక చేస్తున్న మిస్టేక్ ఇదే.. పొరపాటున కూడా రెండోసారి వేడి చేయకూడని ఆహార పదార్థాలివీ..!
ABN, First Publish Date - 2023-07-20T15:03:06+05:30
ఒకసారి వండిన పదార్థాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల తినడానికి బాగుంటుందేమో కానీ ..
ఆహారం వేడిగా ఉన్నప్పుడు తింటే రుచిగా ఉంటుంది. పైపెచ్చు ఆరోగ్యం కూడా. అందుకే అందరూ వేడిగా ఉన్న ఆహారం తినడానికి ఇష్టపడతారు. అయితే ప్రతిసారి వేడిగా ఉన్న ఆహారం తినడం కుదరదు. చాలా వరకు ఇళ్ళలో మధ్యాహ్నం వండిన కూరలే రాత్రికి కూడా తింటుంటారు. కానీ ఈ వర్షాకాలంలో వాటిని చల్లగా తినలేక మళ్లీ వేడి చేస్తుంటారు. అంతేనా.. రాత్రి కూడా మిగిలిపోతే వాటిని స్టోర్ చేసుకుని మరుసటి రోజు వేడిచేసుకుని తినడం కొందరి అలవాటు. ఒకసారి వండిన పదార్థాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల తినడానికి బాగుంటుందేమో కానీ ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరంగా మారుతాయి. ఇంతకూ ఇలా రెండోసారి వేడి చేయకూడని ఆహారపదార్థాలు ఏంటో తెలుసుకుంటే..
పాలకూర..(Spinach)
పాలకూరలో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. దీంతో వండిన ఏ కూర అయినా రుచిగానూ ఆరోగ్యం చేకూర్చేదిగానూ ఉంటుంది. కానీ పాలకూరతో తయారుచేసిన ఏ కూరను అయినా మళ్లీ వేడి చేయాకూడదు. పాలకూరలో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని మళ్ళీ వేడిచేసినప్పుడు ఆ నైట్రేట్లు కాస్తా నైట్రోసమైన్లుగా రూపాంతరం చెందుతాయి. ఇవి క్యాన్సర్ కారకాలు.
సీఫుడ్స్..(Sea foods)
సముద్రపు ఆహారాలైన చేపలు, పీతలు వంటివి ఆరోగ్యానికి చాలామంచివి. వీటితో చాలా విభిన్న రకాల వంటలు చేసుకుని తింటారు. పప్పు, చారు కంటే ఈ కూరలు ఖరీదైనవి కావడంతో మిగిలిపోతే స్టోర్ చేసి మరుసటిరోజు వేడిచేసుకుని తింటుంటారు. కానీ సముద్రపు ఆహారాలు ఇలా చేయకూడదు. వీటిని వండిన తరువాత కొంచెం చల్లబడగానే ఆ పూటకు కావలసినంత తీసుకుని మిగిలింది ఫ్రిజ్ లో పెట్టేసుకోవచ్చు. మళ్లీ కావలసినప్పుడు దాన్ని బయటకు తీసి వేడిచేసుకుని తినవచ్చు.
అన్నం..(rice)
మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలలో మిగిలిపోయిన అన్నం చూస్తూ చూస్తూ పడేయాలంటే మనసొప్పదు. ఈ కారణంగా అన్నంతో ప్రయోగాలు చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల బాసిల్లస్ అనే బ్యాక్టీరియా పెరిగి ఆరోగ్యాన్ని దెబ్బతీసే కారకంగా మారుతుంది. అన్నాన్ని కూడా సముద్రపు ఆహారాల్లాగా కాస్త చల్లారిన వెంటనే ఫ్రిజ్ లో ఉంచుకుని తరువాత కావలసినప్పుడు వేడిచేసుకుని తినవచ్చు.
గుడ్లు..(eggs)
గుడ్లలో ప్రొటీన్ సమృద్దిగా ఉంటుంది. ఉడికించిన లేదా వేయించిన గుడ్లను రెండవ సారి వేడిచేయకూడదు. అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాల్లో నైట్రోజన్ అధికంగా ఉంటుంది. వీటిని మళ్లీ వేడి చేస్తే అది ఆక్సీకరణం చెంది క్యాన్సర్ కారకం అవుతుంది.
Viral: జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులూ.. మీకో సవాల్.. ఈ ఫొటోలో అసలు ఎన్ని అంకెలు ఉన్నాయో చెప్పగలరా..?
బీట్రూట్..(beetroot)
బీట్రూట్ ఆరోగ్యానికి చాలామంచిది కానీ దీన్ని మళ్లీ వేడి చేస్తే ఇందులో టాక్సిన్లు చాలా సులువుగా ఏర్పడతాయి. అలాంటి ఆహారం తింటే చేతులారా టాక్సిన్ లు కడుపులోకి పంపినట్టే.
పుట్టగొడుగులు..(mushrooms)
పుట్టగొడుగులైను సాధారణంగానే సరైన విధంగా నిల్వచేయకపోతే అవి హానికరమైన బ్యాక్టీరియాను అభివృద్ది చేస్తాయి. ఇక వీటిని వండిన తరువాత మళ్ళీ వేడిచేసుకుని తింటే జీర్ణసంబంధ సమస్యలు, కడుపు నొప్పి వంటివి దారుణంగా ఉంటాయి.
చికెన్.. (chicken)
అధికశాతం మంది భారతీయు తినే మాంసాహం చికెన్. మిగిలిపోయిన చికెన్ ను చాలామంది ఫ్రిజ్ లో ఉంచి మరుసటిరోజు వేడిచేసుకుని తింటుంటారు. కానీ దీనివల్ల చికెన్ లో ప్రోటీన్ మొత్తం నాశనమవ్వడమే కాకుండా ఇది జీర్ణవ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించే దిశగా పనిచేస్తుంది.
బంగాళాదుంపలు.. (potato's)
బంగాళాదుంప కూర ఎంత రుచిగా ఉంటుందో దాన్ని మళ్ళీ వేడి చేసినప్పుడు అంత టేస్ట్ లెస్ గా మారిపోతుంది. బంగాళాదుంపలు వండిన తరువాత కాలం గడిచేకొద్ది అందులో క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా డవలప్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా కలిగిన ఆహారం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
Viral: ఆశలన్నీ వదిలేసుకున్నారు.. కానీ సడన్‌గా మోగిందో కాలింగ్ బెల్.. తలుపులు తీసి చూస్తే కనిపించిన వ్యక్తిని చూసి..!
Updated Date - 2023-07-20T15:03:06+05:30 IST