Marriage Dates: హమ్మయ్య.. బ్యాచులర్స్‌కు మంచి రోజులొచ్చాయోచ్.. మే, జూన్ నెలల్లో పెళ్లికి మంచి ముహూర్తాలివే..!
ABN, First Publish Date - 2023-05-01T15:52:04+05:30
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. పెళ్లి సంబంధాలు కుదిరినా ముహూర్తాలు లేకపోవడంతో చాలా పెళ్లిళ్లు వెయిటింగ్‌లు ఉండిపోయాయి. త్వరలోనే
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. పెళ్లి సంబంధాలు కుదిరినా ముహూర్తాలు లేకపోవడంతో చాలా పెళ్లిళ్లు వెయిటింగ్‌లు ఉండిపోయాయి. త్వరలోనే గురు మూఢమి వీడనుండడంతో భాజాభజంత్రీలకు మంచి కళ రాబోతోంది. ఇంకో వైపు బ్యాచులర్స్ కూడా మంచి రోజులు ఎప్పుడొస్తాయా? అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మొత్తం మీద వారి ఎదురుచూపులకు ముగింపు పలికి రోజులు దగ్గరలోనే ఉండడం శుభపరిణామం (Marriage Dates).
పెళ్లి అంటేనే ఎంతో సందడి. హడావుడి. పెళ్లి చూపులు దగ్గర నుంచీ నిశ్చితార్థం దాకా.. ఆ తర్వాత వివాహం అయ్యేంత వరకూ ఎంతో బిజీ బిజీగా ఉంటారు. ఇక పెళ్లి డేట్ ఫిక్స్ అయిందంటే చాలూ.. హడావుడి మామూలుగా ఉండదు. వంట మనుషులు, సౌండ్ సిస్టం, లైటింగ్, డెకరేషన్, కారులు, బస్సులు, మండపాలు, టపాసులు ఇలా ఒకటేంటి? పెళ్లితో ముడిపడి ఉన్న ప్రతీ దాన్ని ముందుగానే అడ్వాన్స్‌లు ఇచ్చి బుక్ చేసుకుంటారు. మొత్తంగా చెప్పాలంటే పెళ్లంటే ఒక పండుగ. చుట్టాలు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు.. ఇలా అందరితో ఇల్లంతా ఎంతో సందడిగా మారిపోతుంది.
అయితే గత కొద్ది రోజులుగా ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లు ఆగిపోయాయి. గత మార్చి 28వ తేదీ నుంచీ గురు మూఢమితో వివాహాలు నిలిచిపోయాయి. ఇప్పుడు మూఢమి పోవడంతో ఈనెల 3వ తేది నుంచీ మళ్లీ పెళ్లి బాజాల సందడి మొదలుకానుంది.
మే, జూన్ నెలల్లో ( May, June months) ఎక్కువ ముహూర్తాలు ఉండటం విశేషం (heavy Marriage Muhurats). జూన్ 14వ తేదీ తర్వాత మళ్లీ ఆగస్టు 18వ తేదీ వరకు శుక్ర మూఢమి కారణంగా పెళ్లిళ్లకు శుభ ముహుర్తాలు లేవు. దీంతో వేసవిలోనే పెళ్లి తంతు పూర్తి చేయాలని వధూవరుల కుటుంబాలు ముహుర్తాలు ఖరారు చేసుకుంటున్నారు. మే నెలలో 3, 4, 5, 6, 7, 10, 11, 12, 13, 14, 20, 21, 26, 27, 31 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. అటు తర్వాత జూన్‌లో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 14 తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు.
మే, జూన్ నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో వేలల్లో వివాహాలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మందికి సరిపోయే నక్షత్రాలు ఉండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. అందుకోసమే ముందుగానే కల్యాణ మండపాలు బుక్ చేసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు ఈవెంట్ ఆర్గనైజర్లు, క్యాటరింగ్, వస్త్ర వ్యాపారులు, బంగారం, వెండి వ్యాపారాలు, అలంకరణ, రవాణా వాహన యజమానులు, మేళతాళాల ట్రూప్‌లు, డీజేలు, టెంట్‌హోస్‌లకు ఈ ముహూర్తాలతో మంచి డిమాండ్ రాబోతున్నట్లు తెలుస్తోంది.
Updated Date - 2023-05-01T15:52:04+05:30 IST