ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Homemade Geyser: వేలకు వేలు పెట్టి గీజర్లు కొనలేక.. ఇంట్లోనే ఎలా తయారు చేశారో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-11-28T16:00:26+05:30

అసలే ఇది చలికాలం కావడంతో ప్రతి ఒక్కరూ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇళ్లలో వాటర్ హీటర్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కొందరు వేలకు వేలు వెచ్చించి గీజర్లు ఏర్పాటు చేసుకుంటుంటారు. అయితే...

అసలే ఇది చలికాలం కావడంతో ప్రతి ఒక్కరూ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇళ్లలో వాటర్ హీటర్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కొందరు వేలకు వేలు వెచ్చించి గీజర్లు ఏర్పాటు చేసుకుంటుంటారు. అయితే అంత ధర వెచ్చించలేక కొందరు, కరెంట్ బిల్లు పెరిగిపోతుందనే భయంతో మరికొందరు చన్నీటితోనే సర్దుకుపోతుంటారు. ఇంకొందరు మాత్రం తమ తెలివితేటలకు పదనుపెట్టి వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వేలకు వేలు పెట్టి గీజర్లు కొనలేక... ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘నీ తెలివికి హ్యాట్సాప్ బ్రదర్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. నీరు వేడి చేసేందుకు ఓ వ్యక్తి గీజర్ (Geyser) అవసరం లేకుండా, కరెంట్ అవసరం లేకుండా ఇంట్లోనే సొంతంగా తయారు చేసేశాడు. ఇందుకోసం అతను ఎంతో తెలివిగా ఆలోచించాడు. ముందుగా పొడవాటి ఓ రాగి పైపును (Copper pipe) తీసుకున్నాడు. దాని మధ్యలో వంకర్లు తిప్పాడు. పైపు ఓ వైపు భాగాన్ని ఎత్తులో ఏర్పాటు చేసిన కొళాయికి ఏర్పాటు చేశాడు. మరో వైపు భాగాన్ని బకెట్‌లో పెట్టాడు. రాగి పైపు మధ్యలో వంకర్లు తిరిగిన ప్రాంతం వద్ద గ్యాస్ పొయ్యిని ఏర్పాటు చేశాడు.

Viral: ఇలాంటి మహిళా పోలీసును ఎక్కడా చూసుండరు.. పసికందు ఏడుపు ఆపడానికి ఈమె ఏం చేసిందో తెలిస్తే..

కొళాయి ఆన్ చేయగానే నీళ్లన్నీ పైపు గుండా బకెట్‌లోకి వస్తున్నాయి. మధ్యలో మంట పెట్టడం వల్ల నీరు బకెట్‌లోకి వచ్చేసరికి వేడిగా మారిపోయాయి. ఈ విధంగా అతను విద్యుత్ అవసరం లేకుండా గీజర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సూపర్ ఐడియా బ్రదర్’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయయ్యా.. ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, ‘‘ఇది వృథా ప్రయాస.. తక్కువ వేడికి ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుంది’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Cheapest Market: దేశంలోనే ఛీపెస్ట్ మార్కెట్ ఇదే.. 5 జతల లెదర్ షూలు కేవలం 500 రూపాయలేనట..!

Updated Date - 2023-11-28T16:00:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising